- Telugu News Photo Gallery Cinema photos Vishwak Sen New Photos goes attractive in social media Telugu Hero's Photos
Vishwak Sen: మాస్ టూ స్టైలిష్ లుక్ వరకు నెవ్వర్ బిఫోర్ విశ్వక్ సేన్ ఫోటోస్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫలక్ నుమా దాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. మాస్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నారు.
Updated on: Aug 19, 2023 | 6:46 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫలక్ నుమా దాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. మాస్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటివరకు నటుడిగా.. దర్శకుడిగా మెప్పించిన విశ్వక్.. ఇప్పుడు హోస్ట్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలిపేందుకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ నోట్ షేర్ చేశారు.

అందులో తన జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నానని.. త్వరలోనే కుటుంబాన్ని స్టార్ట్ చేయబోతున్నాను అంటూ ఓ గ్రీటింగ్ కార్డు షేర్ చేశాడు.

దీంతో విశ్వక్ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. విశ్వక్ కు కాబోయే భార్య ఎవరంటూ నెట్టింట సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు.

ఇక ఇదే విషయంపై అందరి అంచనాలను తారుమారు చేస్తూ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు విశ్వక్. తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్టార్ట్ కాబోతున్న సరికొత్త షోకు విశ్వక్ హోస్ట్ గా చేయబోతున్నారు.




