Re Releasing Movies: రీ రిలీజ్ కాదు.. రీ రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలు.! ఆ లిస్ట్ లో బాబాయి , అబ్బాయి.
పెద్ద సినిమాల్లేవు.. స్టార్ హీరోలు ఇప్పట్లో వచ్చేలా లేరు.. అలాగని చూస్తూ కూర్చుంటామా..? ఏదో ఒకటి చేయాల్సిందే అంటున్నారు నిర్మాతలు. అవసరమైతే రీ రిలీజ్ కాదు.. రీ రీ రిలీజ్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు. ఇదే జరుగుతుందిప్పుడు. అకేషన్‌తో పనిలేకుండా.. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా వచ్చిన సినిమాల్నే మళ్లీ మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈ సీన్ ఇప్పుడు టాలీవుడ్‌కు బాగా సెట్ అవుతుంది.