- Telugu News Photo Gallery Cinema photos Releasing Telugu Movies on Feb 23 2024 and competition between Sundaram Master vs Masthu Shades Unnai Ra Telugu Entertainment Photos
Tollywood: బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించని సందడి.! మళ్ళీ చిన్న సినిమాలే ఎంటర్టైన్మెంట్.
కొన్ని వారాలుగా మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి కనిపించడం లేదు. ఈగల్, ఊరుపేరు భైరవకోన కూడా ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకున్నాయి. ఈ వారం పేరున్న సినిమాలేం రావట్లేదు.! అలాగని తీసిపారేసే కంటెంట్ కూడా కాదు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 సినిమాలు ఈ శుక్రవారం వస్తున్నాయి. మరి అవేంటి.. అందులో ఏది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.?
Updated on: Feb 24, 2024 | 10:11 PM

కొన్ని వారాలుగా మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి కనిపించడం లేదు. ఈగల్, ఊరుపేరు భైరవకోన కూడా ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకున్నాయి. ఈ వారం పేరున్న సినిమాలేం రావట్లేదు.!

అలాగని తీసిపారేసే కంటెంట్ కూడా కాదు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 సినిమాలు ఈ శుక్రవారం వస్తున్నాయి. మరి అవేంటి.. అందులో ఏది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.?

ఫిబ్రవరి 23న 9 సినిమాలు వస్తున్నాయి. అందులో అన్నింటికంటే వైవా హర్ష హీరోగా నటించిన ‘సుందరం మాస్టర్’పై కాస్తో కూస్తో అంచనాలున్నాయి. కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న ఈ సినిమాను రవితేజ నిర్మించడంతో ఆసక్తి పెరిగింది.

అలాగే మరో కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా నటించిన ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ కూడా ఇదే వారమే వస్తుంది. మూడు నాలుగు నెలలుగా వార్తల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఎట్టకేలకు ఈ వారం విడుదలవుతుంది.

వివాదామే ప్రధానంగా ఈ చిత్రం వస్తుంది. ఇక బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సిద్ధార్థ్ రాయ్ సైతం ఫిబ్రవరి 23నే వచ్చేస్తుంది. అతడు, ఆర్య లాంటి సినిమాల్లో బాల నటుడిగా నటించిన దీపక్ సరోజ్ ఇందులో హీరో.

మలయాళంలో సంచలనం రేపిన మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘భ్రమయుగం’ను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల చేస్తున్నారు.

వీటితో పాటు అల్లు అర్జున్ బావమరిది విరాన్ నటించిన ముఖ్య గమనిక, కొత్త వాళ్లు నటించిన మరో 3 సినిమాలు ఈ వారమే వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ప్రియమణి, యామీ గౌతమ్ నటించిన ఆర్టికల్ 370, విద్యుత్ జమాల్ హీరోగా నటించిన క్రాక్ సినిమాలు ఫిబ్రవరి 23న వస్తున్నాయి.




