పెళ్లికి ముందు కలర్స్ స్వాతికి, పెళ్లయ్యాక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్వాతికి ఎంత తేడా వచ్చిందీ.. బాప్‌రే! అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. పెళ్లికి ముందు స్వాతి మనసుకు ఏం అనిపిస్తే అది మాట్లాడేసేవారు. ''తనకు ఎవరూ లవ్ ప్రపోజ్ చేయరని, పెళ్లి చేసుకుంటావా అని డైరక్ట్ గా అడుగుతారని, వాళ్ల మనసుల్లో పెళ్లి ఇన్‌టెన్షన్ ఉండేదీ, లేనిదీ ఈజీగా అర్థమైపోతుందని, అబ్బాయిల్లో సైకోలు ఉంటారని, తన చిన్నాన్ననీ, నాన్ననీ గుర్తుచేసుకున్నప్పుడు... ఇలాంటి మంచి వాళ్లు కూడా ఉంటారు కదా అని అనిపిస్తుందని...'' ఇలా రకరకాలుగా ఒపీనియన్స్ షేర్ చేసుకునేవారు.