- Telugu News Photo Gallery Cinema photos Tollywood stars who are busy with movie shootings after the Sankranti season
Telugu Heroes: ముగిసిన సంక్రాంతి సీజన్.. ఏ హీరోలు ఎక్కడున్నారంటే..
సంక్రాంతి సెలవుల మత్తు నుంచి ఇంకా మన హీరోలు బయటికి వచ్చినట్లు కనిపించడం లేదు. మరోవైపు సంక్రాంతికి వచ్చిన హీరోలంతా రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. దాంతో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే సెట్స్‌లో బిజీగా ఉన్నారు. చిరంజీవి లాంటి సీనియర్స్ ఇంకా షూటింగ్‌లో అడుగు పెట్టలేదు. మరి ఏ హీరో ఎక్కడున్నారో స్పెషల్ ఈటీ షూటింగ్ అప్‌డేట్స్ స్టోరీలో చూసేద్దాం..
Updated on: Jan 23, 2024 | 3:59 PM

సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్‌కు రానట్లే. ఈ హీరోల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు అనౌన్సమెంట్ లేదు . తర్వాతి చిత్రాలపై క్లారిటీ లేదు.

ఇక సలార్ మత్తు నుంచి త్వరగానే బయటకొచ్చి నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయ్యారు ప్రభాస్. కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతుంది. అలాగే మారుతి రాజా సాబ్‌కు డేట్స్ ఇచ్చారు రెబల్ స్టార్.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా దేవర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వార్ 2 షూటింగ్ కి వెళ్లనున్నారు తారక్. తర్వాత ఎన్టీఆర్31 చిత్రీకరణ జరగనుంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రెండు వారాలుగా RFCలోనే జరుగుతుంది. అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. బాలకృష్ణ, బాబీ సినిమా షూటింగ్ మారేడు మిల్లి నుంచి హైదరాబాద్ నాంపల్లికి షిఫ్ట్ అయింది.

నాగ చైతన్య, చందూ మొండేటి తండేల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో జరుగుతుంది. 2 వారాలుగా అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చందూ. పైగా టీజర్‌కు రెస్పాన్స్ అదిరిపోవడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న సరిపోదా శనివారం షూటింగ్ గోషామహల్‌లో జరుగుతుంది.




