The GOAT: ది గోట్ సినిమా పై రూమర్స్ కు చెక్ పెట్టిన చిత్రయూనిట్
కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఫైనల్‌గా చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రీ కొడకులుగా డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు దళపతి.
Updated on: Jul 31, 2024 | 7:19 PM

మల్టీప్లెక్స్‌లో చూస్తే కిక్ రాదని.. సెకండ్ క్లాస్‌లో ఆ సినిమా చూసారని చెప్పుకొచ్చారు. సరిగ్గా గోట్ రిలీజ్ టైమ్‌లో సలార్ మ్యాటర్ వైరల్ కావడం.. సినిమా ప్రమోషన్‌కు బాగానే హెల్ప్ అవుతుంది.

అయినా తెలుగులో కూడా విజయ్ మార్కెట్ బాగానే ఉంది కదా అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ చూసేయండి.. మీకే అర్థమవుతుంది. సినిమా సినిమాకు తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు విజయ్.

ఒకప్పుడు పోస్టర్ ఖర్చులు కూడా రావన్నారు కానీ ఇప్పుడు విజయ్ సినిమా వస్తే పాతిక కోట్లు ఖాయమైపోయాయి. ప్రస్తుతం గోట్‌తో మన ఆడియన్స్‌ను సెప్టెంబర్ 5న పలకరింబోతున్నారు విజయ్.

తాజాగా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది ది గోట్ టీమ్. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న ది గోట్ ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అని క్లారిటీ ఇచ్చింది. ఈ అప్‌డేట్‌తో విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

దాంతో దెబ్బకు విజయ్ వైరల్ అవుతున్నారు. గత డిసెంబర్‌లో సలార్ విడుదలైంది. ఆ టైమ్‌లో హైదరాబాద్‌లోనే ఉన్న విజయ్.. సలార్ సినిమాను సిటీలోనే బెస్ట్ మాస్ థియేటర్‌లో చూసారని చెప్పారు నటుడు వైభవ్.




