- Telugu News Photo Gallery Cinema photos Telugu producers who are spending hundreds of crores on Tamil heroes and what about our heroes?
Tamil Heroes: తమిళ హీరోలపై వందల కోట్లు బిజినెస్.. మన హీరోల మాటేంటి.?
తెలుగు హీరోలు ఖాళీగా లేరా లేదంటే దర్శకులు చెప్పిన కథలు మన హీరోలకు నచ్చడం లేదా..? ఉన్నట్లుండి ఈ డౌట్ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మరెందుకు రాదు చెప్పండి.. ఒకప్పుడు తమిళ హీరోలతో సినిమా చేయడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించే మన నిర్మాతలు.. ఇప్పుడు వాళ్లకే వందల కోట్లు ఇస్తున్నారు. అసలెందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు..?
Updated on: Feb 01, 2024 | 3:00 PM

తెలుగు హీరోలు ఖాళీగా లేరా లేదంటే దర్శకులు చెప్పిన కథలు మన హీరోలకు నచ్చడం లేదా..? ఉన్నట్లుండి ఈ డౌట్ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మరెందుకు రాదు చెప్పండి.. ఒకప్పుడు తమిళ హీరోలతో సినిమా చేయడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించే మన నిర్మాతలు.. ఇప్పుడు వాళ్లకే వందల కోట్లు ఇస్తున్నారు. అసలెందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు..?

ఒకప్పుడు తెలుగులో విజయ్ సినిమాలు విడుదల చేయడానికి కూడా నిర్మాతలు ఆలోచించారు.. ఈయన సినిమా ఎవరు చూస్తారు.. పోస్టర్ ఖర్చులు కూడా రావన్నారు. కానీ అలాంటి విజయ్ కోసం ఇప్పుడు తెలుగు నిర్మాతలు క్యూ కడుతున్నారు. గతేడాది దిల్ రాజు నిర్మాణంలో వారసుడు సినిమా చేసారీయన.. తాజాగా DVV ఎంటర్‌టైన్మెంట్స్‌లో సినిమా చేయబోతున్నారు. దర్శకుడిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

పెయిడ్ ప్రీమియర్స్‌కు సై అంటోన్న 'చోటా' మూవీస్.. ముందుగానే చూసేయ్యండంటూ..!

దుల్కర్ సల్మాన్‌తోనూ వరస సినిమాలు చేస్తున్నారు మన నిర్మాతలు. వైజయంతి మూవీస్‌లో మహానటి, సీతారామం చేసిన దుల్కర్.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో లక్కీ భాస్కర్‌తో బిజీగా ఉన్నారు.

అజిత్ సైతం మైత్రి మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ఇక సూర్య కంగువా సినిమాను స్టూడియో గ్రీన్‌తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.