హీరోయిన్ గా తాప్సి గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఝుమ్మంది నాదం చిత్రంతో తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత వరుసగా చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీను ఒక ఊపు ఊపింది. తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత మెల్లిగా బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక మరింత బోల్డ్ గా మారిపోయింది. సినిమాలోనే కాదు ఇంటర్వ్యూలలో కూడా తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం.