Trivikram: త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి.. లైన్‌లో ఆ ముగ్గురూ

ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..? సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jan 25, 2024 | 9:06 PM

ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..?

1 / 5
సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. కానీ త్రివిక్రమ్ మాత్రం నెక్ట్స్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా ప్రకటించినా.. అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.

2 / 5
ఎలా చూసుకున్నా.. మరో ఆర్నెళ్లకు పైగానే పుష్ప 2తో బిజీగా ఉంటారు అల్లు అర్జున్. ఈ లెక్కన అన్ని రోజులు త్రివిక్రమ్ ఆయన కోసమే వేచి చూడాల్సి వస్తుంది.

3 / 5
అందుకే ఈ లోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు గురూజీ. దీనికోసమే నాని, రామ్ లాంటి హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో నాని, వెంకటేష్ మల్టీస్టారర్ గురించి చర్చ బాగా నడుస్తుంది.

4 / 5
రైటర్‌గా ఉన్నపుడు వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు చేసారు త్రివిక్రమ్. కానీ దర్శకుడిగా మారాక ఈ కాంబినేషన్ రాలేదు. మరోవైపు రామ్‌తోనూ త్రివిక్రమ్ ఉంటుందని చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. బన్నీ సినిమా ఎలాగూ లేట్ అయ్యేలా ఉంది కాబట్టి.. వీటిలో ఏదో ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి చేయాలని చూస్తున్నారు మాటల మాంత్రికుడు.

5 / 5
Follow us