- Telugu News Photo Gallery Cinema photos Star heroes are waiting for the call of successful Directors
Heroes waiting: తగ్గదేలే.. స్టార్ హీరోలైన మా కోసం వెయిట్ చెయ్యాల్సిందేనంటున్న దర్శకులు..
హీరోల కాల్షీట్ల కోసం సక్సెస్‌ఫుల్ కెప్టెన్లు వెయిట్ చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎ చేంజ్.... ఇప్పుడు ఫార్మ్ లో ఉన్న సక్సెస్‌ఫుల్ కెప్టెన్ల పిలుపు కోసం స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేదు... తమ అభిమాన దర్శకుల నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా? ఎప్పుడెప్పుడు వాలిపోదామా? అని వేచి చూస్తున్నారు హీరోలు. అలాంటి వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సూపర్‌స్టార్‌లు, కన్నడ రాక్‌స్టార్ కూడా ఉన్నారు... వాళ్ల వెయిటింగ్ ఇంకెన్నాళ్లు? చూసేద్దాం పదండి...
Updated on: Dec 17, 2023 | 12:47 PM

ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త పర్సనల్ టైమ్ తీసుకున్నారు రాజమౌళి. ఫ్యామిలీకి క్వాలిటీ టైమ్ ఇచ్చాక వెంటనే మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు. మహేష్ సినిమా సంగతులేంటని ఎవరైనా అడిగితే, చెప్పాల్సిన టైమ్‌లో చెప్తామని అంటున్నారు. ఇటు త్రివిక్రమ్ గుంటూరు కారాన్ని కంప్లీట్ చేస్తున్న మహేష్ కూడా రాజమౌళి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు.

జక్కన్న యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇప్పుడు డిజైన్ చేస్తున్నారన్నది సోర్స్. మరి సినిమా ప్రొడక్షన్ పనులు పండగ పోయాక మొదలుపెడతారా? గుంటూరు కారం సక్సెస్ మీట్‌లో అయినా మహేష్... తన నెక్స్ట్ సినిమా గురించి హింట్ ఇవ్వకపోతారా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అంతే కాదు, సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత మహేష్‌బాబుని బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వేదిక మీద చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు అభిమానులు.

జక్కన్న కోసం మహేష్ ఎలా వెయిట్ చేశారో, ప్రశాంత్ నీల్ కోసం రాక్‌స్టార్ యష్ కూడా అలాగే వెయిట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు... దాదాపు ఎనిమిదేళ్లుగా కేజీయఫ్ థీమ్‌తో ట్రావెల్ అవుతున్నారు యష్.

తన కష్టానికి తగ్గ ప్రతిఫలం కేజీయఫ్, కేజీయఫ్2 రూపంలో ఆల్రెడీ అందిందన్నది యష్ మాట. ఇప్పుడు టాక్సిక్ సినిమా చేస్తున్నారు రాక్‌స్టార్. ఈ సినిమా కంప్లీట్ కాగానే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ కి వెళ్లాలన్నది యష్ ప్లానింగ్. మరి అంతలోపు ప్రశాంత్ రెడీగా ఉంటారా? లేదా? ఇంకొన్నాళ్లు వెయిట్ చేయిస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇటు జైలర్‌తో సూపర్‌సక్సెస్ అందుకున్న కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా లోకేష్ కనగరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తలైవర్ ఆల్రెడీ ఓ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లినా...- లోకేష్ సినిమా మీదే ఫ్యాన్స్ కాన్‌సెన్‌ట్రేషన్ మొత్తం ఉంది. అది అర్థం చేసుకున్నారు కాబట్టే, కథను పకడ్బంధీగా సిద్ధం చేసుకుంటున్నారు లోకేష్. ఇప్పటిదాకా ప్రతి ప్రాజెక్టూ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసి మొదలుపెట్టిన లోకేష్, తలైవర్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం అలవాటు మార్చుకోవాలనుకుంటున్నారట. దీన్ని బట్టి లోకేష్ ఏ రేంజ్ సక్సెస్‌ని ఆశిస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు తంబీస్.




