- Telugu News Photo Gallery Cinema photos Heroes Mass avatars in Tollywood looks goes viral in social media Telugu Entertainment Photos
Tollywood: సౌత్‌లో హీరోల నయా ట్రెండ్.! అదిరిపోయే మాస్ లుక్ లో తెలుగు హీరోస్.
నార్త్ సంగతేమోగానీ, సౌత్‌లో మాత్రం హీరోలు గడ్డాలు, మీసాలతో రగ్గ్ డ్ లుక్స్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మేనియా కనిపిస్తోంది. పుష్పరాజ్ మళ్లీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా? చిత్తూరు యాసలో సందడి చేస్తాడా? భన్వర్‌సింగ్ షెకావత్‌తో ఎలాంటి ములాఖత్ ఉంటుందా? అని ఆశగా ఎదురుచూస్తోంది అల్లు ఆర్మీ. ఆగస్టులో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
Updated on: Dec 16, 2023 | 9:45 PM

నార్త్ సంగతేమోగానీ, సౌత్‌లో మాత్రం హీరోలు గడ్డాలు, మీసాలతో రగ్గ్ డ్ లుక్స్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మేనియా కనిపిస్తోంది.

పుష్ప పార్ట్ 2 కోసం రెడీ చేస్తున్న ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆడి పాడుతున్నారు. ఊ అంటావా పాటలో సమంత మాత్రమే బన్నీతో స్టెప్పేశారు. కానీ ఇప్పుడు సీక్వెల్ కోసం సిద్ధం చేస్తున్న ఐటమ్ సాంగ్‌లో కృతి సనన్, దిశా పాట్ని... ఇద్దరూ ఐకాన్ స్టార్‌తో కలిసి స్టెప్పేస్తున్నారు.

భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో కనిపిస్తున్నారు తారక్. ఆల్రెడీ సర్‌తో సూపర్‌సక్సెస్ తెచ్చుకున్న ధనుష్... వచ్చే ఏడాది కెప్టెన్ మిల్లర్ మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకున్నారు.

అసలే బ్రిటిష్ టైమ్‌లో జరిగే పీరియాడిక్ సినిమా కావడంతో ధనుష్ లుక్‌ని దానికి తగ్గట్టే డిజైన్ చేశారు మేకర్స్. ఒకరకమైన రగ్డ్ వాతావరణంలో ధనుష్ చెలరేగే తీరును కళ్లారా చూడ్డానికి మేం రెడీ అంటున్నారు తమిళ తంబిలు.

కంగువ సినిమా ఏకంగా 35 ప్లస్ లాంగ్వేజెస్‌లో రెడీ కాబోతోంది. అంటే లోకల్, నాన్ లోకల్ అనే మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేదు కంగువ. సూర్య లుక్ పక్కా మాస్‌గా ఉంది. దీంతో పాటు ఇంకో తొమ్మిది లుక్కులు ఉంటాయనే టాక్ కూడా ఉంది. వాటిలో కొన్ని స్టైలిష్‌గా ఉంటే ఉండొచ్చేమోగానీ, ఇప్పటికి మాత్రం కంగువ ఊర మాస్ వెరైటీ మూవీ అనే ప్రచారమవుతోంది.

కన్నడ హీరోలు జుట్టు పెంచకుండా సినిమాలు చేయడం అనే కాన్సెప్టుకు ఎప్పుడో బైబై చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు యష్ హీరోగా చేస్తున్న టాక్సిక్, కాంతార ప్రీక్వెల్ కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1 కూడా మాస్ లుక్‌లో ఉన్న మూవీసే. హీరోలు, గడ్డాలు, మీసాలతో కనిపించే మూవీసే. 2024 నుంచి 2025 దాకా కూడా ఈ మాస్ అవతార్ కల్చర్ సౌత్‌ని రూల్ చేస్తుందన్నదానికి ఇదే ఎగ్జాంపుల్.




