- Telugu News Photo Gallery Cinema photos Star Boy Siddu Jonnalagadda Upcoming Movie Tillu Square Update in Tollywood Telugu Entertainment Photos
Tillu Square: స్టార్ బాయ్ ఈజ్ బ్యాక్.. ఈసారి మరింత రొమాంటిక్ అండ్ కామెడీగా టిల్లు స్క్వేర్.
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో సిద్దూకి జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ వల్లే సూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. ఈ సినిమాతో సిద్దూ జోన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Aug 25, 2023 | 8:21 PM

సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో సిద్దూకి జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ వల్లే సూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. ఈ సినిమాతో సిద్దూ జోన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయిందంటేనే ఈ మూవీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

అందుకే ఆ వైబ్‌ను అలాగే కంటిన్యూ చేస్తూ సీక్వెల్‌నూ రూపొందిస్తున్నారు మేకర్స్.డీజీ టిల్లు సినిమా సక్సెస్‌లో హీరోతో పాటు హీరోయిన్ రాధిక క్యారెక్టర్ కూడా కీ రోల్ ప్లే చేసింది. అమాయకంగా కనిపిస్తూనే నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నేహాశెట్టి పెర్ఫామెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

అందుకే సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ పేరును ఎనౌన్స్ చేయటంతో టిల్లు ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యారు. తాజాగా డీజే టిల్లు అభిమానులను ఖుషి చేసే ఖబర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీక్వెల్‌లోనూ రాధిక క్యారెక్టర్ కనిపించబోతోందట.

దాదాపు పది నిమిషాల గెస్ట్ రోల్‌లో నేహా శెట్టి కనిపిస్తారన్న న్యూస్ ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. రాధిక క్యారెక్టర్ ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు..

సీక్వెల్‌లో నేహా ఎంట్రీకి అదిరిపోయే రెస్పాన్స్ రావటం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్‌తో ఆకట్టుకున్న టిల్లు మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయటం గ్యారెంటీ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























