- Telugu News Photo Gallery Cinema photos Sreeleela on Hold in Tollywood: Bollywood Calling or Script Snub
Sreeleela: మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ లేపిన శ్రీలీల.. ఇప్పుడు దూరం.. కారణం
మూడేళ్లుగా గ్యాప్ లేకుండా తెలుగులో సినిమాలు చేసిన శ్రీలీల.. ఉన్నట్లుండి ఇక్కడ గ్యాప్ తీసుకోడానికి కారణమేంటి..? టాలీవుడ్‌లో ఆమెకు నచ్చే కథలు మన దర్శకులు రాయట్లేదా..? లేదంటే బాలీవుడ్‌పై ఉన్న ఇష్టంతో అక్కడి సినిమాల వైపు అడుగులేస్తున్నారా..? ఈ విషయంపై శ్రీలీల ఏమంటున్నారు..? అసలేంటి ఆమె ప్లానింగ్..?
Updated on: Sep 05, 2025 | 9:26 PM

మూడేళ్ళ కింద ధమాకాతో మొదలైన శ్రీలీల మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది.. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఈమె మాత్రం వరసగా హీరోలందర్నీ కవర్ చేసారు.

ఇప్పుడు కూడా రవితేజతో మాస్ జాతర.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు. కాకపోతే వీటి తర్వాత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు సైన్ చేయట్లేదు ఈ వైరల్ వయ్యారి.

అనుకోకుండా కాదు.. కావాలనే తెలుగు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు శ్రీలీల. ముఖ్యంగా తెలుగులో తనకు నచ్చే కథలు రావట్లేదని చెప్తున్నారు ఈ బ్యూటీ. ఇన్నాళ్లూ అయిందేదో అయిపోయింది.. ఇకపై తనకు నచ్చే కథలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు ఈ బ్యూటీ.

ఈ విషయంలో బాలీవుడ్ మేకర్స్ తన స్వభావానికి తగ్గ పాత్రలు రాస్తున్నారని చెప్పారు శ్రీలీల.ఖాళీ లేక కాదు.. కథలు నచ్చకే కింగ్డమ్, లెనిన్ నుంచి నుంచి తప్పుకున్నారని శ్రీలీల కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది.

ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాతో పాటు తమిళంలో శివకార్తికేయన్‌తో పరాశక్తిలో నటిస్తున్నారు శ్రీలీల. ఈ లెక్కన నచ్చే కథ వస్తే గానీ తెలుగులో శ్రీలీలను చూడలేరేమో అభిమానులు..? కాకపోతే ఆ లోపే మాస్ జాతరతో ఓసారి పలకరించనున్నారు ఈ బ్యూటీ.




