- Telugu News Photo Gallery Cinema photos Siddu Jonnalagadda Tillu Square to Chiranjeevi latest Film Updates from Tollywood film industry
Film Updates: టిల్లు స్క్వేర్ నుంచి కొత్త పాట.. ఆహా వేడుకలో చిరంజీవి..
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. నస్లెన్ కే. గఫూర్, మమితా బైజు జంటగా గిరీష్ తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా ప్రేమలు. విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ జంటగా రూపొందుతున్న సినిమా ‘కలియుగం పట్టణంలో’. నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓటీటీలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె చేస్తున్న కొత్త కార్యక్రమం చెఫ్ మంత్ర.
Updated on: Mar 21, 2024 | 8:23 AM

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మై లిల్లీ పాట విడుదల చేసారు దర్శక నిర్మాతలు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పాట లాంఛ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.

ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన రాకతో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌కు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

నస్లెన్ కే. గఫూర్, మమితా బైజు జంటగా గిరీష్ తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా ప్రేమలు. మలయాళంలో సంచలనాలు రేపిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగులోనూ అదే చేస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసారు. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ అనువాద చిత్రంగా రికార్డ్ సృష్టించింది ప్రేమలు. ఈ సినిమా ఇప్పటి వరకు 10 రోజుల్లో 10.54 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ జంటగా రూపొందుతున్న సినిమా ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్ రెడ్డి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ‘ఆ నలుగురు’ సినిమాలో బాలనటుడిగా నటించిన విశ్వ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు.

నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓటీటీలో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె చేస్తున్న కొత్త కార్యక్రమం చెఫ్ మంత్ర. ఇప్పటికే మొదలైన సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతుంది. మూడో సీజన్‌లో ప్రేక్షకులకు వినోదంతో పాటు.. సెలెబ్రిటీల ఫన్నీ చిట్ చాట్‌లు ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ఈ వారం ప్రోమో విడుదల చేసారు నిర్వాహకులు. నవదీప్, తేజస్విని మదివాడ ఈ వారం అతిథులుగా వచ్చారు.




