- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu SSMB 29 to Allu Arjun Pushpa 2 The Rise Latest Movie Updates from Tollywood
Movie News: జపాన్‌లో మహేష్ రాజమౌళి సినిమా ముచ్చట.. పుష్ప 2లో యానిమల్ బ్యూటీ.?
రాజమౌళి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఉస్తాద్. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు తృప్తి దిమ్రి. ఇప్పుడు ఈమెకు దక్షిణాది నుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య కీలక పాత్రల్లో సూరపల్లి వెంకటరమణ తెరకెక్కిస్తున్న సినిమా మెర్సీ కిల్లింగ్. 2024లో మలయాళం సినిమాకు గోల్డెన్ టైమ్ నడుస్తుంది.
Updated on: Mar 21, 2024 | 8:15 AM

రాజమౌళి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమా ముచ్చట్లు చెప్పారు రాజమౌళి. ఇందులో మహేష్ తప్ప ఇంకెవరూ ఖరారు కాలేదని.. స్క్రిప్ట్ వర్క్ అయిపోయినా ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయని తెలిపారు జక్కన్న. విడుదల సమయంలో మహేష్ బాబుని ఇక్కడికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఉస్తాద్. ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ డైలాగ్ టీజర్ విడుదల చేస్తున్నారు మేకర్స్. దీనికి ముహూర్తం ఫిక్స్ చేసారు. మార్చి 19 సాయంత్రం 4.45 నిమిషాలకు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.

యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు తృప్తి దిమ్రి. ఇప్పుడు ఈమెకు దక్షిణాది నుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అందులో భాగంగానే పుష్ప 2లో తృప్తి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పుష్ప-2లో బన్నీ అనుచరుడిని ట్రాప్ చేసే పాత్రలో త్రిప్తి నటించబోతున్నారని తెలుస్తుంది. యానిమల్‌లోనూ హీరోను ట్రాప్ చేసే పాత్రలోనే ఈమె నటించారు.

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య కీలక పాత్రల్లో సూరపల్లి వెంకటరమణ తెరకెక్కిస్తున్న సినిమా మెర్సీ కిల్లింగ్. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను తాజాగా యువ హీరో ఆకాశ్ పూరీ విడుదల చేసారు. ఆయన మాట్లాడుతూ మెర్సీ కిల్లింగ్ అనే టైటిల్ ఆసక్తికరంగా ఉందని.. కచ్చితంగా సినిమాలో విషయం కూడా చాలా బాగుంటుందని తెలిపారు.

2024లో మలయాళం సినిమాకు గోల్డెన్ టైమ్ నడుస్తుంది. భ్రమయుగం, ప్రేమలు సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. మంజిమల్ బాయ్స్ కొత్త చరిత్రే రాసేసింది. గతేడాది విడుదలైన 2018 సినిమాకు వచ్చిన 175 కోట్లే కేరళలో ఇప్పటి వరకు హైయ్యస్ట్. ఇప్పుడా రికార్డ్‌ను మంజిమల్ బాయ్స్ తిరగరాసింది. ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.




