- Telugu News Photo Gallery Cinema photos Samyuktha menon stunning saree photos goes viral on social media
Samyuktha Menon: చిన్న గ్యాప్ ఇచ్చింది.. ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు లైనప్ చేసింది.
ప్రస్తుతం దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆపర్స్ మాత్రం రాలేదు ఆమె సంయుక్తమీనన్.
Updated on: Sep 27, 2025 | 10:27 PM

ప్రస్తుతం దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆపర్స్ మాత్రం రాలేదు ఆమె సంయుక్తమీనన్.

గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది సంయుక్తా మీనన్.. అయినా టాలీవుడ్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో సంవత్సరంపాటు తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.

2016 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.

దీంతో ఈ అమ్మడిని గోల్డెన్ బ్యూటీ అన్నారు. కానీ వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. 2023లో ఆమె హీరోయిన్ గా చేసిన డెవిల్ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

చాలా కాలంగా మరో సినిమా చేయకుండా సైలెంట్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు 8 సినిమాల్లో నటిస్తుంది. బాలకృష్ణతో అఖండ 2, పూరీ, విజయ్ సేతుపతి కాంబో, శర్వానంద్ జోడిగా నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ, నిఖిల్ జోడిగా స్వయంభు, లారెన్స్ బెంజ్, హిందీలో మహారాణి చిత్రాల్లో నటిస్తుంది.