- Telugu News Photo Gallery Cinema photos Samantha Celebrates Diwali With Kids At Pratyusha Support Foundation, See Photos
Samantha: ఆ పిల్లల ముఖాల్లో వెలుగు నింపిన సమంత.. చిన్నారులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. తన ప్రత్యూష ఫౌండేషన్ లో ఉన్న పిల్లలతో కలిసి దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Oct 19, 2025 | 5:43 PM

దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం డిఫరెంట్ గా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. సినిమాలతో పాటు సమాజ సేవ చేసే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసింది.

ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులకు ఈ ఫౌండేషన్ లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక సమంత టైమ్ దొరికినప్పుడల్లా పిల్లలను కలుస్తూ ఉంటుంది.

తాజాగా సమంత ‘ప్రత్యూష’ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో పాల్గొంది. అక్కడ చికిత్స పొందుతోన్న పేద పిల్లలతో కలిసి పండగను సెలెబ్రేట్ చేసుకుంది.

ఈ సందర్భంగా చిన్నారులందరికీ గిఫ్ట్ లు కూడా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సామ్ నిన్నటి సాయంత్రం చాలా ఆనందంగా గడిచిందని ఎమోషనలైంది.

ప్రస్తుతం సమంత దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సమంతను అభినందిస్తున్నారు.




