- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress who Acted With Megastar Chiranjeevi and Mahesh Babu, Still Beautiful At age of 50, Her Name Is Sonali Bendre
Tollywood : చిరంజీవి, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 50 ఏళ్ల వయసులో చెక్కు చెదరని అందం.. ఎన్నాళ్లకు కనిపించింది..
ఒకప్పుడు తెలుగులో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మీనా, సిమ్రాన్, సంఘవి, సంగీత, రీమా సేన్, ఆర్తి అగర్వాల్ వంటి తారలు ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు కొందరు సినిమాల్లో కొనసాగుతుండగా.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Updated on: Oct 19, 2025 | 4:21 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఒకప్పుడు అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఇప్పుడు 50 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. ఇంతకీ ఆమె ఎవరంటే..

మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదండి. ఒకప్పటి అందాల రాశి సోనాలి బింద్రె. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, మహేష్ బాబుతో మురారి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు అందం, అభినయంతో తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది.

తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. క్యాన్సర్ కారణంగా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

50 ఏళ్ల వయసులో ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పింక్ కలర్ చీరకట్టులో రెట్రో హీరోయిన్ గా ముస్తాబై సోనాలి షేర్ చేసిన ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హిందీలో పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే సినిమాల్లో అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన సోనాలి.. 1994లో ఆగ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే మహేష్ బాబు సరసన మురారి సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.




