Remuneration: స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్.. నిర్మాతల దైర్యం అదేనా..
హీరోల మార్కెట్ పెరిగిపోయినపుడు.. వాళ్లతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు బడ్జెట్ కూడా భారీగానే పెరుగుతుంది. మరీ ముఖ్యంగా రెమ్యునరేషన్స్ కూడా కొండెక్కి కూర్చోవడం ఖాయం. తాజాగా ఇదే జరుగుతుంది. ఏకంగా 100 కోట్ల నుంచి 250 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు కొందరు హీరోలు. ఒకప్పుడు సినిమాలకు 100 కోట్లు వస్తే పండగ చేసుకునే వాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు 100 కోట్ల పారితోషికం కూడా తక్కువే అనిపిస్తుంది. దానికి కారణం మన హీరోల రేంజ్ ఇప్పుడు 1000 కోట్లకు చేరడమే. ఓ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. టార్గెట్ 1000 క్రోర్స్ అంటున్నారు హీరోలు. అందుకే వాళ్ల పారితోషికం కూడా అదే స్థాయిలో అందుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
