Priyamani : బాలీవుడ్ లో కేవలం హింందీ మాట్లాడే నటులే ఉంటారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రియమణి
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టారనే చెప్పాలి
Updated on: Jan 31, 2022 | 7:00 AM

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టారనే చెప్పాలి

ఇప్పుడు సినిమాలతో వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు ప్రియమణి. తాజాగా ఆమె ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సినిమాలను ఆకాశానికెత్తేశారు.

ఒకప్పుడు మనకు బాలీవుడ్ ని శాషించిన శ్రీదేవి..రేఖ..హేమా మాలిని..వైజయంతి మాల లాంటి నటులు ఉండేవారు. వాళ్ల తర్వాత ఎవరూ కనిపించలేదని ఆమె అన్నారు.

బాలీవుడ్ లో కేవలం హింందీ మాట్లాడే యాక్టర్స్ మాత్రమే ఉంటారు. చెన్నై.. కేరళ ఇలా సౌత్ ఏరియా నుంచి ఎవరు వెళ్లినా వారు హిందీ మాట్లాడని వ్యక్తులుగా చిత్రీకరించేవారు అని అన్నారు.

సౌత్ టెక్నీషియన్లను బాలీవుడ్ కి తీసుకెళ్లడం..వారు అక్కడ తమదైన గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని ప్రియమణి అన్నారు. సౌత్ ప్రతిభకి నార్త్లో పెద్ద పీట వేస్తున్నారు అని ప్రియమణి తెలిపారు.

ప్రియమణి బాలీవుడ్లో `రావణ్` చిత్రంతోపరిచయం అయ్యారు. ఆ తర్వాత `రక్త చరిత్ర-2` సినిమా చేశారు, అలాగే షారుక్ ఖాన్ హీరోగా నటించిన `చెన్నై ఎక్స్ ప్రెస్` లో స్పెషల్ సాంగ్ లో మెరిశారు.

ప్రస్తుతం షారుక్- అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్రను పోషిస్తున్నారని తెలుస్తుంది.




