- Telugu News Photo Gallery Cinema photos Nupur Sanon latest stunning photos got viral in social media
Nupur Sanon: ఎర్ర గులాబీలను బొమ్మగా చేసి.. వెన్నెలతో ప్రాణం పోసి ఈ వయ్యారిని భువిపైకి పంపాడేమో ఆ బ్రహ్మ..
నుపుర్ సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, ఆమె "ఫిల్హాల్" (2019) మరియు "ఫిల్హాల్ 2: మొహబ్బత్" (2021) అనే మ్యూజిక్ వీడియోలలో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2023లో, ఆమె టెలివిజన్ ధారావాహిక పాప్ కౌన్? మరియు తెలుగు యాక్షన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇప్పుడు ఈ వయ్యారి భామ గురించి కొన్ని విషయాలు మీ కోసం..
Updated on: Jan 25, 2024 | 6:32 PM

15 డిసెంబర్ 1995న దేశ రాజధాని ఢిల్లీ నగరంలోజన్మించింది అందాల తార నుపుర్ సనన్. ఈమె తండ్రి పేరు రాహుల్ సనన్ మరియు ఆమె తల్లి పేరు గీతా సనన్. తన హైస్కూల్ విద్య న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివింది. చదువుకునే రోజుల్లో చదువులో బాగానే ఉండేది. నుపుర్ సనన్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో సంగీతంలో కోర్సు పూర్తి చేసింది.

2005లో యూట్యూబ్‌లో అద్భుతమైన పాటల రీమేక్‌లను పోస్ట్ చేయడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. యూట్యూబ్‌లో ఆమె తొలి ప్రదర్శన 2005లో బెకరార్ కర్కే అనే పాట. ఆమె మనోహరమైన వాయిస్‌తో యూట్యూబ్‌లో హృదయాలను గెలుచుకుంది. తరువాత, ఆమె తేరే సాంగ్, హవాయెన్, జనమ్ జనమ్ మరియు లయన్ లాయన్ వంటి అనేక రకాల పాటలను ప్రదర్శించింది.

తన అద్భుతమైన స్వరం మరియు ప్రదర్శనతో ప్రజలను మంత్రముగ్ధులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సరసన 2019 ఫిల్హాల్ మ్యూజిక్ వీడియోతో తెరపైకి అడుగుపెట్టింది. 2021 సంవత్సరంలో, అక్షయ్ కుమార్ తో ఫిల్హాల్ 2 వీడియోలో కనిపించింది.

2023లో రవితేజ సరస టైగర్ నాగేశ్వర్రావు అనే తెలుగు మాస్ యాక్షన్ బయోపిక్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది.

ప్రస్తుతం నూరానీ చెహ్రా అనే ఓ హిందీ చిత్రంలో నటిస్తుంది. అదే కాకుండా తెలుగులో మంచు విష్ణుకి జోడిగా కన్నప్ప అనే చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తుంది. ఇందులో ప్రభాస్ శివునిగా, నయనతార పార్వతిగా నటిస్తున్నరు. మోహన్ బాబు, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




