- Telugu News Photo Gallery Cinema photos Movies coming in theaters for Ganesh Chaturthi include Devara, Lucky Baskhar, The Goat
Tollywood News: వినాయక చవితి పై కన్నేసిన స్టార్ హీరోలు
అదేంటో గానీ మన దర్శక నిర్మాతలు కేవలం సంక్రాంతిని మాత్రమే పండగలా చూస్తుంటారు.. ఆ తర్వాత వచ్చే ఏ సీజన్‌ను కూడా పట్టించుకోరు.. సమ్మర్‌తో సహా..! దసరా, దీపావళిని అయితే కనీసం పట్టించుకోవట్లేదు. ఇన్ని పండగల మధ్య వినాయక చవితే కాస్త బెటర్ అనిపిస్తుంది. దానికోసం కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. అవేంటో తెలుసా..? కల్కితో టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఆర్నెళ్లుగా సైలెంట్‌గా ఉన్న బాక్సాఫీస్‌ను తట్టి లేపారు ప్రభాస్.
Updated on: Aug 22, 2024 | 1:13 PM

అదేంటో గానీ మన దర్శక నిర్మాతలు కేవలం సంక్రాంతిని మాత్రమే పండగలా చూస్తుంటారు.. ఆ తర్వాత వచ్చే ఏ సీజన్‌ను కూడా పట్టించుకోరు.. సమ్మర్‌తో సహా..! దసరా, దీపావళిని అయితే కనీసం పట్టించుకోవట్లేదు. ఇన్ని పండగల మధ్య వినాయక చవితే కాస్త బెటర్ అనిపిస్తుంది. దానికోసం కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. అవేంటో తెలుసా..?

కల్కితో టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఆర్నెళ్లుగా సైలెంట్‌గా ఉన్న బాక్సాఫీస్‌ను తట్టి లేపారు ప్రభాస్. ఆ ఊపుతోనే మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. జులై 12న భారతీయుడు 2, ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, 35, ఆయ్ లాంటి సినిమాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉంది. అప్పుడు మరో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి.

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అయితే అప్పుడు పోటీ భారీగా ఉండటంతో.. సెప్టెంబర్ 7న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉంటే.. సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న చరణ్, తారక్ చేతిలో మాత్రం చెరో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.

ఈలోపే ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిప్పుడు. ఎందుకో తెలియదు కానీ తెలుగులో మాస్టర్, బీస్ట్, లియో లాంటి సినిమాలపై ఉన్న హైప్.. గోట్‌కు కనిపించట్లేదు.




