- Telugu News Photo Gallery Cinema photos Mega Hero Varun Tej Hopes on Matka Movie Telugu Heroes Photos
Varun Tej – Matka: వరుణ్ బ్యాడ్ టైం.. ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న మెగా హీరో.
ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు పర్ఫెక్ట్ హిట్ పడితే చూడాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ఒక్క హిట్టే ఆ హీరో దగ్గరకు రాకుండా ఊరిస్తూ ఉంటుంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ పాపులరే అయినా.. కొన్ని చోట్ల ఆ మాటలను ఆచి తూచి వాడాల్సి వస్తోంది. బేఫికర్‌గా వాడేసే రోజు త్వరలోనే ఉందంటూ హోప్స్ పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. కెరీర్ ప్రారంభంలో మంచి మంచి సినిమాలే పడ్డాయి వరుణ్‌తేజ్‌కి.
Updated on: Jun 10, 2024 | 2:22 PM

ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు పర్ఫెక్ట్ హిట్ పడితే చూడాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ఒక్క హిట్టే ఆ హీరో దగ్గరకు రాకుండా ఊరిస్తూ ఉంటుంది.

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ పాపులరే అయినా.. కొన్ని చోట్ల ఆ మాటలను ఆచి తూచి వాడాల్సి వస్తోంది. బేఫికర్‌గా వాడేసే రోజు త్వరలోనే ఉందంటూ హోప్స్ పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.

కెరీర్ ప్రారంభంలో మంచి మంచి సినిమాలే పడ్డాయి వరుణ్‌తేజ్‌కి. బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టే కలెక్షన్లు వచ్చాయా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే ప్రేక్షకులకు ఫీల్ గుడ్ కలిగించే సినిమాలు బాగానే చేసి ఫిదా చేశారు ఈ హీరో.

ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ నుంచి గద్దలకొండ గణేష్‌తో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మల్టీస్టారర్లతోనూ, రకరకాల కాన్సెప్టులతోనూ స్టైలిష్ యాక్షన్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేశారు.

డిఫరెంట్ కంటెంట్‌ని డ్రైవ్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నా సక్సెస్ మాత్రం ఎందుకో ఆయన్ని పలకరించడం లేదు. నిన్నటి విషయం ఎందుకు, రేపు ఏంటని ఆలోచిద్దాం అని ఫిక్సయిపోయారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్.

రీసెంట్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్న వరుణ్ తేజ్ త్వరలోనే మట్కా సెట్స్ కి వెళ్తారు. 1950 నుంచి 1980 వరకు జరిగే కథతో తెరకెక్కుతోంది మట్కా.

ఆల్రెడీ కొన్ని కీలక షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే క్రూషియల్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సినిమా ఎలాగైనా వరుణ్‌కి పెద్ద హిట్ కావాలనే గోల్‌తోనే పనిచేస్తోంది టీమ్.



