- Telugu News Photo Gallery Cinema photos Vedha movie will release in competition with Pushpa 2 The Rule
Pushpa 2 The Rule: పుష్పతో యొద్దనికి సై.. ఇంతకీ ఆ సినిమా ఏంటి..?
పుష్ప 2 సినిమాకు ఎదురెళ్లడానికి స్టార్ హీరోలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు. ఎందుకులే ఆయనతో.. అసలే తగ్గేదే లే అంటున్నాడంటూ కామ్‌గా సైడ్ ఇచ్చేస్తున్నారు. సౌత్ టూ నార్త్ పుష్ప 2పై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇంత సునామీలోనూ ఓ హీరో బన్నీతో పోటీకి సై అంటున్నారు. మరి ఆయనెవరు..? ఇంతకీ ఆ సినిమా ఏంటి..?
Updated on: Jun 10, 2024 | 12:59 PM

పుష్ప 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది.. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయాలని ఫిక్సైపోయారు మేకర్స్. దీనికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ కూడా పర్ఫెక్టుగా జరుగుతున్నాయి.

టాలీవుడ్ టూ బాలీవుడ్ పుష్ప 2పై ఉన్న అంచనాల దృష్ట్యా.. పోటీగా రావడానికి ఏ హీరో కూడా ధైర్యం చేయట్లేదు. ఆగస్ట్ 15న ప్లాన్ చేసిన సింగం 3ని కూడా వాయిదా వేసారు రోహిత్ శెట్టి.

తెలుగులో ఆగస్ట్ 15న షెడ్యూల్ అయిన సినిమా పుష్ప 2 మాత్రమే. అలాగే తమిళంలోనూ ఏ సినిమా దీనికి పోటీ లేదు. సింగం 3 తప్పుకోవడంతో బాలీవుడ్‌లోనూ పోటీ ఉండదనుకున్నారంతా.

కానీ ఊహించని విధంగా జాన్ అబ్రహాం నటిస్తున్న వేదా సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.పుష్ప 2పై తెలుగు కంటే హిందీలోనూ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.. మార్కెట్ కూడా అక్కడే భారీగా జరుగుతుంది.

అలాంటి సినిమాతో పోటీ అంటే చిన్న విషయం కాదని తెలిసినా కూడా ధైర్యం చేస్తున్నారు జాన్. నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న వేదాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. పుష్ప రూల్‌ను జాన్ అబ్రహాం తట్టుకుంటారో లేదో..?




