- Telugu News Photo Gallery Cinema photos There is a possibility of making a film with Shankar Ajith, the news is buzzing in Kollywood
Shankar: ఆ స్టార్ హీరోతో శంకర్ సినిమా.. వేగంగా న్యూస్ స్ప్రెడ్..
ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న విషయాల్లో ఏమాత్రం నిజం ఉన్నా సరే, అతి త్వరలో ప్యాన్ ఇండియా రేంజ్‌లో మూవీ లవర్స్ ఓ మెగా కొలాబరేషన్ గురించి వినడం ఖాయం. ఇప్పటిదాకా కలవని ఆ కాంబో మీద ఎప్పటి నుంచో ఆశలైతే కనిపిస్తున్నాయి. అవి త్వరలోనే నిజమవుతాయా? కమాన్ లెట్స్ వాచ్...
Updated on: Jun 10, 2024 | 12:40 PM

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్ ప్రస్తావన రాగానే మనకు మేవరిక్ డైరక్టర్ శంకర్ పేరు గుర్తుకు వచ్చేస్తుంది. అప్పుడెప్పుడో రోబో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శంకర్.

ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని అలరించే సినిమా ఆయన నుంచి రాలేదు. అలాంటిది శంకర్‌ని నమ్మి చెర్రీ సినిమా చేస్తున్నారంటేనే కథలో ఏదో క్రియేటివిటీ ఉండే ఉంటుందన్నది ఫ్యాన్స్ లో కనిపిస్తున్న ఆశ.ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది గేమ్ చేంజర్.

అంతకన్నా ముందే వచ్చే నెల్లో విడుదలవుతోంది భారతీయుడు2. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పార్ట్ త్రీకి సంబంధించిన పోర్షన్ కూడా తెరకెక్కించేశానని ప్రకటించారు శంకర్. ఇటు గేమ్ చేంజర్, అటు ఇండియన్ త్రీక్వెల్ పనులు పూర్తయితే ఒక రకంగా శంకర్ కాల్షీట్ ఖాళీ అన్నమాట.

ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కాగానే ఆయన రణ్‌వీర్‌సింగ్ ప్రాజెక్టుతో బిజీ అవుతారని అనుకున్నారు అంతా. కానీ అంతకన్నా ముందే ఆయన అజిత్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయన్నది కోలీవుడ్‌లో గుప్పుమంటున్న వార్త.

వీరిద్దరూ కలిసి ఇప్పటిదాకా సినిమా చేయలేదు. అందుకే వీరి కాంబో గురించి న్యూస్ పుట్టగానే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్... శంకర్ సెట్స్ కి వెళ్తారన్నది ట్రెండింగ్ న్యూస్. నిజానిజాలేంటన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.




