Kantara prequel: కాంతార ప్రీక్వెల్ గురించి హింట్ ఇచ్చిన రిషబ్‌శెట్టి..
అట్టా సూడమాకండీ అంటున్నారు కాంతార హీరో రిషబ్‌శెట్టి. కాంతార సినిమా తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పారు. అంతకన్నా ముఖ్యంగా కాంతార ప్రీక్వెల్ విషయంలో బిగ్గెస్ట్ కొలాబరేషన్ గురించి హింట్ ఇచ్చారు రిషబ్. డివైన్ బ్లాక్ బస్టర్‌గా కలెక్షన్లు కొల్లగొట్టేసింది కాంతార మూవీ. కథలో కంటెంట్ ఉండాలేగానీ, కోట్లు కురిపించడం చిటికెలో పని అని ప్రూవ్ చేసింది కాంతార.