Rajeev Rayala |
Updated on: Jan 04, 2022 | 8:32 PM
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్. అతి తక్కువ సమయంలో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
అందాల ముద్దుగుమ్మ కీర్తిసురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు తమిళ్ భాషల్లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్కారు వారి పాట మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
తాజాగా ముద్దుగ్గుమ్మ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్ స్వయంగా ప్రకటించింది.
తమిళ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించనున్నట్లుగా టాక్.