Victrina wedding: పెళ్లి వేడుకలో కుందనపు బొమ్మలా కత్రినా.. వైరల్‌గా మారిన విక్ట్రీనా వెడ్డింగ్ లేటెస్ట్ ఫొటోలు..
బాలీవుడ్ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా అనే విలాసవంతమైన హోటల్‌లో గురువారం సాయంత్రం వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది.