- Telugu News Photo Gallery Cinema photos IMDB has released a list of 100 most searched celebrities on Google
Movie News: గూగుల్ సర్చ్ లో వీరే టాప్.. IMDB 100 మంది లిస్ట్ విడుదల..
గత పదేళ్ళలో ఇండియాలో ఏ సెలబ్రెటీ కోసం గూగుల్‌లో అత్యధికంగా సర్చ్ చేసారో తెలుసా..? మన సౌత్ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా తెలుగులో ఎవరి కోసం ఆడియన్స్ ఆసక్తిగా వెతికారో ఐడియా ఉందా..? 2014 నుంచి 2024.. ఈ మధ్యలో మోస్ట్ సర్చ్‌డ్ వ్యూవ్డ్ 100 మంది ప్రముఖుల జాబితాను విడుదల చేసింది IMDB సంస్థ. మరి వాళ్లెవరో చూద్దామా..?
Updated on: Jun 04, 2024 | 12:16 PM

IMDB లిస్ట్ లో దీపిక పదుకొనే టాప్ ప్లేస్‌లో ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో ఉన్నారు. గత పదేళ్లలో వీళ్ల కోసమే నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేసారు.

IMDB విడుదల చేసిన ఈ జాబితాలో టాప్ 20లో తెలుగు హీరోలకు చోటు దక్కలేదు. కానీ హీరోయిన్స్ సమంత 13వ స్థానంలో.. 16వ స్థానంలో తమన్నా.. 18వ స్థానంలో నయనతార ఉన్నారు.

హీరోల పరంగా చూసుకుంటే 29వ స్థానంలో ప్రభాస్ ఉన్నారు. బాహుబలి తర్వాత ఈయన కోసం నార్త్ ఆడియన్స్ వెతకడం మొదలు పెట్టారు. అక్కడ్నుంచే తెలుగు హీరోల మార్కెట్ కూడా భారీగా పెరిగింది.

ప్రభాస్ తర్వాత మీరు కొంతమంది తెలుగు హీరోలు కూడా ఇందులో ఉన్నారు. రామ్ చరణ్‌కు 31వ స్థానం దక్కింది. అలాగే అల్లు అర్జున్ 47.. జూనియర్ ఎన్టీఆర్ 67.. మహేష్ బాబు 72వ స్థానాల్లో నిలిచారు.

ఈ జాబితాలో తమిళ హీరోలు చోటు దక్కించుకున్నారు. ధనుష్ 30.. విజయ్ 35.. రజినీకాంత్ 42.. విజయ్ సేతుపతి 43.. మాధవన్ 50.. కమల్ హాసన్ 54.. సూర్య 62.. విక్రమ్ 92.. అజిత్ 98వ స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేను ప్రపంచ వ్యాప్తంగా కండక్ట్ చేసారు.




