- Telugu News Photo Gallery Cinema photos Malavika Manoj Shares Stunning Photos In Treditional Look telugu movie news
Malavika Manoj: కలువ కన్నులతో కట్టిపడేస్తోన్నమాళవిక మనోజ్.. ఫొటోస్ తోనే మత్తెక్కిస్తోందిగా..
ఒకే ఒక్క సినిమాతో సౌత్ కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరింది మలయాళీ కుట్టి మాళవిక మనోజ్. కలువ కన్నులు.. చంద్రబింబం వంటి మోము.. చక్కటి చిరునవ్వు, ట్రెడిషనల్ లుక్ లో కనిపించి హృదయాలను కొల్లగొట్టేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జో సినిమాలో కథానాయికగా కనిపించింది మాళవిక.
Updated on: Jun 03, 2024 | 6:46 PM

ఒకే ఒక్క సినిమాతో సౌత్ కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరింది మలయాళీ కుట్టి మాళవిక మనోజ్. కలువ కన్నులు.. చంద్రబింబం వంటి మోము.. చక్కటి చిరునవ్వు, ట్రెడిషనల్ లుక్ లో కనిపించి హృదయాలను కొల్లగొట్టేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఇటీవల తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జో సినిమాలో కథానాయికగా కనిపించింది మాళవిక. ఇందులో సుచిత్ర పాత్రలో అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో తెలుగులోనూ రిలీజ్ చేయగా.. ఇటు టాలీవుడ్ అడియన్స్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది.

హరి హరన్ రామ్ దర్శకత్వం వహించిన జో సినిమాలో రియో రాజ్, భవ్య త్రిఖ, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాళవిక ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

టాలెంటెడ్ హీరో సుహాస్ నటిస్తోన్న కొత్త సినిమాలో కథానాయికగా నటిస్తుంది మాళవిక. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ అనిత కీలకపాత్ర పోషిస్తుంది.

తాజాగా మాళవిక మనోజ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పట్టుచీరలో అచ్చం యువరాణిలా కనిపిస్తుంది. 2012లో ప్రకాశన్ పరక్కట్టే సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది మాళవిక.




