VV Vinayak: వివి వినాయక్ కి ఏమైంది.? సినిమాలు ఎందుకు చేయట్లేదు.?
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఎక్కడున్నారు..? ఒకప్పటి నెంబర్ వన్ మాస్ డైరెక్టర్ కొన్నేళ్లుగా ఎందుకు కనిపించడం లేదు..? రెండు ఫ్లాపులు వచ్చేసరికి భయపడిపోయారా..? లేదంటే హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా..? అసలు మునపట్లా వినాయక్ సినిమాలు ఎందుకు చేయట్లేదు..? నెక్ట్స్ సినిమా ఏంటి..?
Updated on: Jun 04, 2024 | 12:45 PM

వివి వినాయక్.. తెలుగు ఇండస్ట్రీలో మాస్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడీయన. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నెం 150.. ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు వినాయక్.

ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వినాయక్. కానీ కొన్నేళ్లుగా వినాయక్ అస్సలు సినిమాలే చేయట్లేదు.. కనీసం నెక్ట్స్ ఏంటనేది కూడా చెప్పట్లేదు.

ఖైదీ నెం 150 హిట్టైనా కూడా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది.. పైగా రీమేక్ కావడంతో వినాయక్‌కు క్రెడిట్ రాలేదు. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్ తర్వాత తెలుగు సినిమాలేం చేయలేదు వినాయక్.

ఈ మధ్యే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో చత్రపతి రీమేక్ చేసినా.. ఫలితం శూన్యం. ఆ మధ్య రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జరిగినా.. అది గాసిప్‌గానే మిగిలిపోయింది.

కేవలం ఫామ్‌లో లేరని వినాయక్‌ను దూరం పెట్టారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన కంటే పెద్ద డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. కానీ వినాయక్‌కు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని.. అందుకే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. త్వరలోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు ఈ మాస్ డైరెక్టర్. ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.




