- Telugu News Photo Gallery Cinema photos Heroines acted in two movies in 2024 year Kavya Thapar, Sai Pallavi, Rashmika Mandanna, Disha Patani
2024లో నయా రికార్డు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు వీరే
ఏడాదికి ఒక్క రిలీజ్ కూడా చూడటం గగనమైపోతున్న సమయంలో ఒకటికి రెండు సినిమాలతో, కొన్నిసార్లు మూడు సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరించడం కామన్ అయిపోయింది కొందరికి. 2024లో అలాంటి రికార్డులు సొంతం చేసుకుంటున్న బ్యూటీస్ గురించి మాట్లాడుకుందాం పదండి.. డబుల్ ఇస్మార్ట్ లో స్టెప్పులేసినా అనుకున్నంత హిట్ రాలేదు కావ్య థాపర్‌కి. అందుకే ఇప్పుడు విశ్వమ్ మీద హోప్స్ పెట్టుకున్నారు ఈ బ్యూటీ.
Updated on: Oct 08, 2024 | 1:32 PM

ఏడాదికి ఒక్క రిలీజ్ కూడా చూడటం గగనమైపోతున్న సమయంలో ఒకటికి రెండు సినిమాలతో, కొన్నిసార్లు మూడు సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరించడం కామన్ అయిపోయింది కొందరికి. 2024లో అలాంటి రికార్డులు సొంతం చేసుకుంటున్న బ్యూటీస్ గురించి మాట్లాడుకుందాం పదండి..

డబుల్ ఇస్మార్ట్ లో స్టెప్పులేసినా అనుకున్నంత హిట్ రాలేదు కావ్య థాపర్‌కి. అందుకే ఇప్పుడు విశ్వమ్ మీద హోప్స్ పెట్టుకున్నారు ఈ బ్యూటీ. ఏడాదికి ఒకటికి రెండు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒకటి ఆడకపోయినా, ఇంకోటి ఆడుతుందనే భరోసా కనిపిస్తోంది కావ్యలో.

సాయిపల్లవి కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆమె నటిస్తున్న అమరన్ ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. చెప్పిన టైమ్‌కి తండేల్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే 2024లో సాయిపల్లవికి రెండు రిలీజులూ ఉన్నట్టే.

ఆల్రెడీ ఈ ఏడాది కల్కిలో కాసేపే కనిపించినా హిట్ సౌండ్‌ని సొంతం చేసుకున్నారు దిశా పాట్ని. వచ్చే నెల్లో సూర్యతో కలిసి కంగువతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో, ఈ మధ్యనే గోట్‌తో పలకరించిన మీనాక్షి చౌదరి త్వరలో మెకానిక్ రాఖీతో కలిసి ప్రేక్షకులను కలవనున్నారు.

వీళ్లందరూ వేరు. నేను వేరు అంటున్నారు రష్మిక మందన్న. డిసెంబర్ 6న రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. నార్త్ లో చావా, సౌత్‌లో పుష్ప2తో పలకరించనున్నారు రష్మిక. అక్టోబర్‌లో వేట్టయన్‌తో థియేటర్లలోకి వస్తున్న మంజు వారియర్, డిసెంబర్‌లో విడుదలై పార్ట్ 2 తో ఇంకో సారి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు.




