Tollywood News: టైటిల్స్ విషయంలో ఆసక్తి రేపుతున్న సినిమాలు
డిస్కషన్స్ వద్దు బాసూ.. టైటిల్స్ మీరు చెప్తారా.. మమ్మల్నే చెప్పమంటారా..? కొందరు హీరోల సినిమాలకు సోషల్ మీడియాలో అభిమానులు కాస్త అటూ ఇటూగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అరే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి.. అందుకే మాయిష్టం వచ్చిన టైటిల్స్ చెప్పేస్తున్నాం.. తర్వాత తీరిగ్గా మీ టైటిల్స్ చెప్పండి అంటున్నారు. మరి ఏయే సినిమా టైటిల్స్ కోసం ఫ్యాన్స్ అంతగా వేచి చూస్తున్నారు..? స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ముందు టైటిల్స్ కోసమే చూస్తుంటారు ఫ్యాన్స్.
Updated on: Mar 04, 2024 | 4:29 PM

డిస్కషన్స్ వద్దు బాసూ.. టైటిల్స్ మీరు చెప్తారా.. మమ్మల్నే చెప్పమంటారా..? కొందరు హీరోల సినిమాలకు సోషల్ మీడియాలో అభిమానులు కాస్త అటూ ఇటూగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అరే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి.. అందుకే మాయిష్టం వచ్చిన టైటిల్స్ చెప్పేస్తున్నాం.. తర్వాత తీరిగ్గా మీ టైటిల్స్ చెప్పండి అంటున్నారు. మరి ఏయే సినిమా టైటిల్స్ కోసం ఫ్యాన్స్ అంతగా వేచి చూస్తున్నారు..?

స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ముందు టైటిల్స్ కోసమే చూస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పుడలాంటి టైటిల్స్ విషయంలోనే ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు దర్శకులు. ముఖ్యంగా SSMB 29 టైటిల్ ఇదేనంటూ రోజుకోటి సోషల్ మీడియాలో తిరిగేస్తుంది. ఇంకా ఓపెనింగే కాలేదు కానీ.. మహేష్, రాజమౌళి సినిమాకు మహరాజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

NBK 109 టైటిల్‌పై కూడా చాలా రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా ప్రచారంలోకి రాలేదు. దర్శకుడు బాబీ తన సినిమా టైటిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోసం బాబీ సినిమాకు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. మరోవైపు ఫ్యాన్స్ ఏమో సమరసింహారెడ్డి రీ రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

VD12 టైటిల్‌పై చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగానే విజయ్ దేవరకొండ తన సినిమా టైటిల్స్ ఆలస్యంగా చెప్తుంటారు. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. ఫ్యామిలీ స్టార్ కోసం గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ఆపేసారు కాబట్టి మళ్లీ మొదలైన తర్వాత కానీ టైటిల్‌పై క్లారిటీ రాకపోవచ్చు. అన్నీ కుదిర్తే.. మార్చి చివరి వారం నుంచి విజయ్, గౌతమ్ సినిమా పట్టాలెక్కనుంది.

సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నాని.. ఈ మధ్యే నెక్ట్స్ సినిమాను కూడా ప్రకటించారు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. రామ్ చరణ్, బుచ్చిబాబు టైటిల్ ‘పెద్ది’ అని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మేకర్స్ చెప్పేవరకు కూడా మనోళ్లు ఆగట్లేదు.. తోచిన టైటిల్ సోషల్ మీడియాలో తోసేస్తున్నారంతే.




