AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idli Kottu Movie : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..

కోలీవుడ్ హీరో ధనుష్ చిత్రాలకు తమిళంతోపాటు తెలుగు, హిందీలో మంచి క్రేజ్ ఉంటుంది. హీరోయిజం, యాక్షన్ స్టోరీస్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతుంటారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం ఇలా భాషలతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు ధనుష్. తాజాగా ఆయన నటించిన లేటేస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Oct 24, 2025 | 2:11 PM

Share
కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. నిత్యా మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా దీపావళీ కానుకగా అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి ఈ మూవీతో హిట్ అందుకున్నారు నిత్యా, ధనుష్.

1 / 5
తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని వదిలి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో ధనుష్ కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు. అంతేకాకుండా అంతకు ముందు తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నిత్యామీనన్, ధనుష్. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

2 / 5
అక్టోబర్ 1న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.

3 / 5
ఇడ్లీ కొట్టు నడిపే శివకేశవులు (రాజ్ కిరణ్ ) కొడుకు మురళి (ధనుష్). తన తండ్రి నడుపుతున్న ఇడ్లీ కొట్టును కాస్త ఫ్రాంచైజీలా మార్చేసి అదే పేరుతో ఇతర చోట్ల హోటల్స్ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించాలని ఆశపడతాడు. కానీ తన తండ్రి ఒప్పుకోకపోవడంతో ఊరు వదిలి పట్నం వెళ్లిపోతారు. బ్యాంకాక్ లో జాబ్ చేస్తూ తన తల్లిదండ్రులను పట్టించుకోడు.

4 / 5
అక్కడే సెటిల్ అయిన సత్యరాజ్ కూతురు షాలిని పాండేతో పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ అప్పుడే తన తండ్రి శివకేశవులు చనిపోవడంతో చివరి చూపు కోసం ఊరుకు వచ్చిన మురళి తిరిగి బ్యాంకాక్ వెళ్లాడా..? అతడి జీవితంలో నిత్యా  మీనన్ ఎలా వచ్చింది..? అనేది సినిమా స్టోరీ. ఇప్పుడు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది.

5 / 5