- Telugu News Photo Gallery Cinema photos Coolie Movie Review Will it Affect Lokesh Kanagaraj Cinematic Universe
Lokesh Kanagaraj: టాలీవుడ్ టాప్ హీరో తో లోకేష్ సినిమా చేసేది అప్పుడేనా
ఒక్క ఫ్రైడే చాలు.. సినిమా ఇండస్ట్రీలో తలరాతలు మారడానికి.. అనే మాట ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే లోకేష్ విషయంలో అది ఫ్రైడే దాకా ఆగలేదు. గురువారం రిలీజ్ అయిన కూలీ మూవీకి... లోకేష్ టాలీవుడ్ జర్నీకి లింక్ ఉందా? కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ టైమ్‌లో మామూలు క్రేజ్ లేదు. ఫస్ట్ షో పడ్డాక కూడా అదే క్రేజ్ ఉందా? అంటే యునానిమస్‌గా యస్ అనే టాక్ మాత్రం రావడం లేదు.
Updated on: Aug 19, 2025 | 7:17 PM

కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ టైమ్‌లో మామూలు క్రేజ్ లేదు. ఫస్ట్ షో పడ్డాక కూడా అదే క్రేజ్ ఉందా? అంటే యునానిమస్‌గా యస్ అనే టాక్ మాత్రం రావడం లేదు. స్టార్స్ ఉన్నారు.. జిమ్మిక్కులున్నాయి.. కానీ, కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోయారనే టాక్ వినిపించింది.

ఇప్పటిదాకా లోకేష్ చేసిన అన్ని సినిమాల్లోకీ లీస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న మూవీగా కూలీని కోట్ చేసిన వారు కూడా ఉన్నారు. తనదైన యూనివర్శ్ నుంచి బయటకు వచ్చి లోకేష్ చేసిన మూవీ కూలీ. స్టాండ్ అలోన్ సినిమాగానే ప్రమోట్ చేశారు.

దీంతో అయిన కాస్త డ్యామేజ్‌ని ఖైదీ2తో కవర్ చేయాలనుకుంటున్నారట లోకేష్. ఎల్‌సీయూలో ఖైదీకి స్పెషల్ ప్లేస్ ఉంది. అందుకే ఖైదీ2 మీద మరింత ఫోకస్ చేస్తున్నారు లోకేష్. దీని తర్వాత ఆయన ఆమీర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇరుంబు కై మాయావి చేస్తారా? మరేదైనా కేరక్టర్‌ని బేస్ చేసుకుని చేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ .రోలెక్స్ రోల్ చుట్టూ కూడా ఉండవచ్చనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలన్నిటి తర్వాత తెలుగులో టాప్ హీరోలు అందరితోనూ సినిమా చేయాలని ఉందని చెప్పారు లోకేష్.

కూలీ మూవీని చూసిన తర్వాత స్టాండ్ అలోన్ సినిమాను ఈ కెప్టెన్‌తో చేయడానికి ముందుకొచ్చే టాలీవుడ్ హీరోలు ఎవరనే చర్చ షురూ అయింది. ఆమీర్ మూవీతో ప్రూవ్ చేసుకుంటేనే.. టాలీవుడ్‌లో లోకేష్ కి మళ్లీ పూర్వపు వైభవం ఉంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.




