- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of Sreeleela looking as beautiful as an old heroine
పాత హీరోయిన్‌లా మారిపోయిన శ్రీలీలా.. గుర్తుపట్టడం కష్టమేరోయ్!
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అంద చందాలతో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ అలనాటి నటీమణిలా మరిపోయి, తన అందంతో మతి పొగొడుతుంది. జిగేల్ జిగల్‌మనే అందాలతో ప్రతి ఒక్కరినీ అట్రాక్ట్ చేస్తుంది. మరి మీరు కూడా ఓ లుక్ వేయండి ఆ ఫొటోస్ పై.
Updated on: Aug 19, 2025 | 6:30 PM

పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన నటన, అదంతో ఎంతో మంది మనసు దోచుకుంది. ఇక ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్న ఈ చిన్నదానికి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ తెలుగులో ఊహించిన రేంజ్‌లో అవకాశాలు ఏం రాలేదు.

దీంతో బాలీవుడ్ పై కన్నేసి అక్కడ ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత పుష్ప2లో ఐటమ్ సాంగ్ చేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు గ్రాఫ్ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం శ్రీలీల ఓ వైపు సినిమాలు, మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక కాస్త సమయం దొరికినా చాలు ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాకటివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అలనాటి హీరోయిన్స్ లా రెడీ అయిపోయి తన అంద చందాలతో నెట్టింట రచ్చచేస్తోంది.

చీరకట్టులో, ఒంటి నిండా నగలు ధరించి, కొత్త లుక్‌లో చాలా అందంగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, న్యూ లుక్‌లో శ్రీలీల మహారాణిలా, అందంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరికొంత మంది పాత హీరోయిన్‌లా చాలా క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.



