- Telugu News Photo Gallery Cinema photos Competition between Prabhas and Jr. NTR movies at boxoffice, who will win
Prabhas vs Jr.ntr: పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకేసారి మూడు ప్రాజెక్టులను సెట్ మీద ఉంచడం డార్లింగ్‌కి మాత్రమే సాధ్యమా? మా తారక్‌కి కూడా సాధ్యమే అని అంటున్నారు నందమూరి అభిమానులు. కమాన్ ఒన్ టూ త్రీ అంటూ లెక్కలేస్తున్నారు. కాకపోతే... మీ లెక్కలెలా ఉన్నా, నేను మాత్రం ఫస్ట్ ప్రభాస్ పనులని పూర్తి చేశాకే తారక్ దగ్గరికి వస్తానని అంటున్నారట కెప్టెన్ నీల్. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ఇది పూర్తి కాగానే వెంటనే సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం షూటింగ్‌కి హాజరవుతారట.
Updated on: May 02, 2024 | 7:00 PM

ఒకేసారి మూడు ప్రాజెక్టులను సెట్ మీద ఉంచడం డార్లింగ్‌కి మాత్రమే సాధ్యమా? మా తారక్‌కి కూడా సాధ్యమే అని అంటున్నారు నందమూరి అభిమానులు. కమాన్ ఒన్ టూ త్రీ అంటూ లెక్కలేస్తున్నారు. కాకపోతే... మీ లెక్కలెలా ఉన్నా, నేను మాత్రం ఫస్ట్ ప్రభాస్ పనులని పూర్తి చేశాకే తారక్ దగ్గరికి వస్తానని అంటున్నారట కెప్టెన్ నీల్.

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ట్రిపులార్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కాస్త వెనుకపడ్డారు.

ఫస్ట్ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ వేశారట మేకర్స్. పది రోజుల పాటు సాగే ఈ షూట్‌లో ప్రభాస్, పృథ్వి పార్టిసిపేట్ చేస్తారు. అక్టోబర్‌లోపు శౌర్యాంగపర్వానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తిచేస్తారన్నది టాక్. ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నప్పుడే సెకండ్ పార్టుకు సంబంధించిన మేజర్ పోర్షన్ షూట్ చేశారట. అందుకే ఇప్పుడు షూటింగ్‌ని త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుందన్నది ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న మాట.

ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నుంచి తారక్ సినిమా పనులు మొదలుపెట్టేస్తానని మాటిచ్చారట ప్రశాంత్ నీల్. ఓ వైపు సలార్2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు తారక్ సినిమా షూటింగ్‌ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యతను తీసుకుంటున్నారు మిస్టర్ నీల్. ఆ సెట్‌కి వెళ్లేలోపు దేవర పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను కూడా పూర్తి చేయాలన్నది తారక్ ప్లాన్.

తారక్ హీరోగా నటిస్తున్న దేవర అక్టోబర్‌లో విడుదలకు రెడీ అవుతోంది. తారక్‌కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పార్ట్ ఇంకాస్త బ్యాలన్స్ ఉందన్నది టాక్. సో, వార్2ని, దేవర షూట్‌ని సైమల్‌టైనియస్‌గా కంప్లీట్ చేసేస్తారు తారక్. ఆ తర్వాత కంప్లీట్‌గా ప్రశాంత్‌నీల్ కోసం టైమ్ కేటాయించి మేకోవర్ అవుతారట. ఏడాదికి మూడు సినిమాల సెట్స్ లో మా హీరో రెచ్చిపోతున్నారంటూ సంబరపడుతున్నారు నందమూరి ఫ్యాన్స్.




