- Telugu News Photo Gallery Cinema photos Tollywood new movies update on 01 May 2024 Telugu Entertainment Photos
Tollywood: మొదలైన పుష్పాగాడి రూల్.!| ఆత్మతో ప్రేమ.. ఆశిష్ కు వర్క్ అవుట్ అవుతుందా.?
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప2. అసలు తగ్గేదేలే అన్న కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని ఇవాళ విడుదల చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్.. ప్రోమోకి మంచి స్పందన వస్తోంది. ఆశిష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'లవ్ మీ... ఇఫ్ యు డేర్'. వైష్ణవి చైతన్య నాయికగా నటించారు. ఆత్మతో ఓ యువకుడు ప్రేమలో పడటం అనే కాన్సెప్టుతో తెరకెక్కింది ఈ సినిమా.
Updated on: May 02, 2024 | 3:30 PM

నో కామెంట్స్ అంటున్నారు. అన్నీ బాగానే మ్యానేజ్ చేస్తున్నా.. స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్‌కు కంగారు తప్పట్లేదు. ఇప్పటికీ పుష్ప 2లో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు.

ఆశిష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'లవ్ మీ... ఇఫ్ యు డేర్'. వైష్ణవి చైతన్య నాయికగా నటించారు. ఆత్మతో ఓ యువకుడు ప్రేమలో పడటం అనే కాన్సెప్టుతో తెరకెక్కింది ఈ సినిమా.

లవ్ మీ ఆశిష్ కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందని అన్నారు మేకర్స్. మే 25న విడుదల కానుంది లవ్ మీ ఇఫ్ యు డేర్.

కార్మికుల దినోత్సవం సందర్భంగా పలువురు తనకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని అన్నారు పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి. తన సినిమాలు అన్నిట్లోనూ శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేశానని, ప్రజలు ఆదరించిన తీరును మర్చిపోలేనని అన్నారు ఆర్.నారాయణమూర్తి.

రానా దగ్గుబాటి హీరోగా నటించిన సినిమా లీడర్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ పొలిటికల్ డ్రామాగా మెప్పించింది లీడర్. ఏవీయం సంస్థ నిర్మించింది. లీడర్ సినిమాను మే 9న రీరిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. పొలిటికల్ సీజన్‌కి పర్ఫెక్ట్ సినిమా అని అంటున్నారు ఆడియన్స్.

నేను డివైన్ బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించాను. అందులో నటించాను. అంతే కానీ, నేనేం దైవాంశ సంభూతుడిని కాదు అని అంటున్నారు రిషబ్.




