- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi praises baby movie unit, Latest Tollywood movie updates
Tollywood: బేబీపై మెగాస్టార్ ప్రశంసలు, విడుదలైన ఖుషీ టైటిల్ సాంగ్.. టాలీవుడ్ తాజా అప్‌డేట్స్
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బేబీ మూవీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తనదైన ఫిలిమ్ మేకింగ్, కథనంతో దర్శకుడు సాయి రాజేష్ సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ముఖ్యంగా బడా స్టార్‌లు బేబీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటి మొన్న అల్లు అర్జున్ సినిమాను ప్రశంసగా తాజాగా ఈ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చి చేరారు..
Updated on: Jul 30, 2023 | 5:00 AM

ఖుషీ టైటిల్ సాంగ్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమా ఖుషీ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర టైటిల్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఫారెన్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటకు ఇన్‌స్టంట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్ కానుంది.

నటులు కావలెను.. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పణలో వస్తున్న సినిమా 'ది ఇండియా హౌస్'. ఆ ఇండియా హౌస్ స్థాపించిన కృష్ణవర్మగా అనుపమ్ ఖేర్ నటిస్తుంటే... శివ అనే కుర్రాడి పాత్రలో నిఖిల్ నటిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాను వి మెగా పిక్చర్స్, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి వంశీ కృష్ణ దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో నటించడానికి మేల్ 24 నుంచి 35, 50 నుంచి 60 ఏళ్ల నటులు కావాలని ప్రకటన విడుదల చేసారు. అలాగే 10 నుంచి 12 ఏళ్ల అబ్బాయి.. 20 నుంచి 35, 50 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఫీమేల్ ఆర్టిస్టులు కావాలని ప్రకటనలో తెలిపారు.

లక్కీ భాస్కర్.. మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మన ఆడియన్స్‌కి బాగా చేరువైపోయారు దుల్కర్ సల్మాన్. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ మూడో తెలుగు సినిమాకు ముహూర్తం పెట్టారీయన. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్, శిఖర స్టూడియోస్ దుల్కర్ సల్మాన్ సినిమాను నిర్మిస్తున్నారు.

బేబీకి మెగా ప్రశంస.. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ బేబీ. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి బేబీ సినిమాను చూసారు.. చూడటమే కాకుండా ప్రశసంల వర్షం కురిపించారు. అంతేకాదు.. జులై 30న చిరు కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు బేబీ టీం.

మాయాబజార్ @ 100 స్ట్రీమింగ్ మినిట్స్ సీనియర్ నరేశ్, నవదీప్, ఈశా రెబ్బా ప్రధాన పాత్రల్లో గౌతమి చల్లగుల్ల తెరకెక్కించిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. రానా తన స్పిరిట్ మీడియాపై నిర్మించిన డెబ్యూ వెబ్ సిరీస్ ఇది. ప్రముఖ ఓటిటిలో విడుదలైన మాయాబజార్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అందుకుంది. ఈ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సిరీస్ టీం.




