- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Priyanka Jain Visits Tirumala Srivari Temple With Boyfriend Shiv Kumar, See Photos
Priyanka Jain: ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ బుల్లితెర నటి ప్రియాంక జైన్ తిరుమల శ్రీవారిని దర్శించకుంది. ప్రియుడు, నటుడు శివకుమార్‌తో కలిసి తిరుమలకు వెళ్లిన ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. అనంతరం తమ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Sep 06, 2025 | 10:30 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక జైన్. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది ప్రియాంక జైన్. కాగా ఈ అందాల తార నటుడు శివ్ కుమార్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కలిసి ఉంటోన్నప్రియాంక- జైన్ జంటగానే టూర్లు, విహార యాత్రలు,వెకేషన్లకు వెళుతున్నారు. అలాగే పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజాగా ఈ ప్రేమ పక్షులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

శనివారం తిరుమలకు వచ్చిన ప్రియాంక- శివకుమార్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు

ప్రస్తుతం ప్రియాంక జైన్- శివకుమార్ తిరుమల పర్యటన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక- శివ కుమార్ ఈ ఏడాదిలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ప్రియుడికి ప్రపోజల్ చేసిన విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియాంక. ప్రియుడి బర్త్ డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది.




