- Telugu News Photo Gallery Cinema photos Anchor Sravanthi Chokarapu Visits Assam Kamakhya Temple, See Photos
Sravanthi Chokarapu: ఆ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టాలీవుడ్ యాంకరమ్మ.. ఫొటోస్ వైరల్
టీవీ ప్రోగ్రామ్స్, షోస్, ఈవెంట్లతో బిజి బిజీగా ఉంటే టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు అనూహ్యంగా ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరింది. తాజాగా ఆమె అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రముఖ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.
Updated on: Sep 06, 2025 | 11:11 PM

టాలీవుడ్‌లో స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మాటల సవ్వడితో మైమరిపించే ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా నెట్టింట ఈ అందాల యాంకరమ్మకు మంచి క్రేజ్ ఉంది.

. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది స్రవంతి. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో పాటు ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార.

ఈ మధ్యన ప్రేమలేఖ అనే ఓ సినిమాలోనూ నటించింది స్రవంతి. కొండ రాంబాబు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇలా టీవీ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో బిజి బిజీగా ఉంటే స్రవంతి ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరింది. తాజాగా ఆమె అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అస్సాం కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది

తన స్నేహితులతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లిన స్రవంతి అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'ఈరోజు మాతా కామాఖ్యా దేవి యొక్క దర్శనం గురించి మాటల్లో వర్ణించలేనిది.ధన్యవాదాలు అమ్మ' అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. స్రవంతి. ప్రస్తుతం ఈ యాంకరమ్మ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




