- Telugu News Photo Gallery Cinema photos Actress Tanya Ravichandran Stunning Beautifull Lehanga Photos Goes Viral
Tanya Ravichandran : తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపుతోన్న హీరోయిన్..
తెలుగులో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్లకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లిగా మెరిసింది. కానీ అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలతో గత్తరలేపుతోంది.
Updated on: Mar 29, 2025 | 12:18 PM

తాన్య రవిచంద్రన్... తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. ఉదయనిధి నటించిన నెంజుక్కు నీది చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత ఆయన శిబిరాజ్ 'మాయోన్' , రవి మోహన్ 'అకిలన్' చిత్రాలలో నటించింది. ఇటీవలే అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన రసవాడి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం అరుణ్ విజయ్ నటిస్తున్న రెట్ట తల చిత్రీకరణలో బిజీగా ఉంది.

తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాన్య.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లెహంగాలో మైండ్ బ్లాంక్ చేస్తోంది తాన్య.

లెహంగాలో ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే గ్లామర్ పోజులతో మతిపోగొట్టేస్తుంది తాన్య. నిషా కళ్లతో తాన్య మరింత గార్జియస్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కనిపించింది తాన్య రవిచంద్రన్. ఇందులో చిరు, నయనతార చెల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రాలేదు.





























