- Telugu News Photo Gallery Cinema photos Actor S.J.Suryah gets huge offers and create records with His movies Details here
S.J.Suryah: క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు.. రికార్డ్స్ మోత మోగిస్తున్న ఎస్‌జే సూర్య..
ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు.. గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుందక్కడ. కానీ కొందరు మాత్రం తమకు నచ్చినట్లు కెరీర్‌ను మలుచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ స్టార్ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఒకప్పుడు ఆయన దర్శకుడు.. ఆ తర్వాత నటుడు.. ఇప్పుడో స్టార్.. ప్రతీ పదేళ్ళకు తన కెరీర్‌ను తానే మార్చుకుంటున్నదెవరో తెలుసా.? ఎస్‌జే సూర్య.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో.?
Updated on: Nov 23, 2024 | 7:58 PM

ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు.. గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుందక్కడ. కానీ కొందరు మాత్రం తమకు నచ్చినట్లు కెరీర్‌ను మలుచుకుంటూ ఉంటారు.

అలాంటి ఓ స్టార్ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఒకప్పుడు ఆయన దర్శకుడు.. ఆ తర్వాత నటుడు.. ఇప్పుడో స్టార్.. ప్రతీ పదేళ్ళకు తన కెరీర్‌ను తానే మార్చుకుంటున్నదెవరో తెలుసా.?

ఎస్‌జే సూర్య.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో..? దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. నటుడిగా దున్నేస్తున్నారిప్పుడు.

ఏ సినిమాలో చూసినా ఈయనే దర్శనమిస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోనూ ఎస్‌జే సూర్య మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు. సరిపోదా శనివారంతో ఈయన రేంజ్ మరింత పెరిగింది.

ఖుషీ సినిమాతో తెలుగులో దర్శకుడిగా మ్యాజిక్ చేసిన సూర్య.. ఆ తర్వాత మరే సినిమాతోనూ హిట్టు కొట్టలేకపోయారు. అయితే స్పైడర్‌తో తనలోని నటుడిని పరిచయం చేసారు.

కానీ తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చారు. సరిపోదా శనివారంతో సూర్య రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తున్నారీయన. ఈ చిత్ర ప్రమోషన్స్‌లోనూ జోరుగా పాల్గొంటున్నారు ఎస్‌జే సూర్య.

మొన్న సరిపోదా శనివారం రిలీజ్ టైమ్‌లో నానితో పోటీపడి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు సూర్య.. అలాగే ప్రమోషన్ కూడా చేసారు. తాజాగా గేమ్ ఛేంజర్ బాధ్యత తీసుకున్నారు.

రామ్ చరణ్ లేకపోయినా.. ఆయన డాన్సులు కూడా ఈయనే చేస్తున్నారు. సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్. మొత్తానికి సూర్య టైమ్ నడుస్తుందిప్పుడు.




