35 Chinna Katha Kaadu: 35 చిన్న కథ కాదంటున్న ఆడియన్స్… రెస్పాన్స్ అదుర్స్
ఇంట్లో ప్రతి రోజూ వినే కథో, చూసే కథో అయితే, సిల్వర్ స్క్రీన్ మీద మరింత బావుంటుంది. అందులోనూ వెండితెర మీద మెప్పించిన ఆ కథ ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్న చోటికే అందుబాటులోకి వస్తే... అది చిన్న కథ కాదు.. యస్ 35 చిన్న కథ కాదు.. క్రేజ్ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద కథ మరి.... 70 మిలియన్లకు పైగా వ్యూయింగ్ టైమ్‌తో ఆహా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ లో దూసుకుపోతోంది 35 చిన్న కథ కాదు.
Updated on: Oct 07, 2024 | 9:15 PM

ఇంట్లో ప్రతి రోజూ వినే కథో, చూసే కథో అయితే, సిల్వర్ స్క్రీన్ మీద మరింత బావుంటుంది. అందులోనూ వెండితెర మీద మెప్పించిన ఆ కథ ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్న చోటికే అందుబాటులోకి వస్తే... అది చిన్న కథ కాదు.. యస్ 35 చిన్న కథ కాదు.. క్రేజ్ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద కథ మరి....

70 మిలియన్లకు పైగా వ్యూయింగ్ టైమ్‌తో ఆహా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ లో దూసుకుపోతోంది 35 చిన్న కథ కాదు. తిరుపతి నేపథ్యంలో సాగే మధ్యతరగతి కుటుంబ కథ ఇది. మూసధోరణిలో సాగే చదువుల్లో ఇమడలేక ఇబ్బంది పడ్డ ఓ కొడుకు కథ ఇది.

ఇలాంటి ఇబ్బందులను ప్రతిరోజూ చూస్తున్న వారు కోకొల్లలు. వారందరూ కలిసి 35 చిన్న కథ కాదు సినిమాను భారీ చిత్రంగా మెచ్చుకుంటున్నారు. తల్లీ కొడుకుల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా 35 చిన్న కథ కాదు.

రానా దగ్గుబాటి సమర్పించిన ఈ సినిమాలో సిసలైన ఎదుగుదల అంటే ఏంటో నిర్వచనం చెప్పారు. గౌతమి, నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, పిల్లలు.. ఎవరి రోల్‌లో వారు అద్భుతంగా నటించారు.

ఇది మన కథ అని అందరూ అనుకునేలా తెరకెక్కించారు కెప్టెన్. అర్థం చేసుకుంటే ఏదీ కష్టం కాదు... గెలవడమనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా అంటూ సినిమా థీమ్‌ని ట్రైలర్‌లోనే అద్భుతంగా ఆవిష్కరించారు లేటెస్ట్ గా ఆహా టీమ్. సెలవుల్లో ఫ్యామిలీతో సినిమా చూడాలనుకునేవారికి 35 చిన్న కథ కాదు... పర్ఫెక్ట్ మూవీ అనే మౌత్ టాక్ ఆల్రెడీ స్పీడందుకుంది.




