- Telugu News Photo Gallery Cinema photos Actress Priya Bhavani Shankar Comments About Glamour Roles In Movies
Priya Bhavani Shankar: ‘ఫ్యాషన్ పేరుతో నా శరీరాన్ని చూపించను’.. హీరోయిన్ ప్రియా షాకింగ్ కామెంట్స్..
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. తమిళంతోపాటు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ అమ్మాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా తన నెక్ట్స్ మూవీ బ్లాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Updated on: Oct 07, 2024 | 6:56 PM

కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. తమిళంతోపాటు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ అమ్మాయి.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా తన నెక్ట్స్ మూవీ బ్లాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గ్లామర్ రోల్స్ పోషించడంపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

తాను శరీరాన్ని ఒక వస్తువుగా భావించనని.. ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్ గా కనిపించడం తనకు నచ్చదని.. అలాంటి వాటిని తానేప్పుడు అంగీకరించనని తెలిపింది. ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని చూపించడం నచ్చదని తెలిపింది.

కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడుకూడదనుకుంటానని.. అందుకు అనుగుణంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని తెలిపింది. నెగిటివ్ రోల్ చేయడానికీ వెనుకాడనని చెప్పుకొచ్చింది.

ఎందుకంటే యాక్టింగ్ అనేది తన వవృత్తి అని.. అలాగే ఒక హీరోయిన్ గా ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని ప్రమోట్ చేయలేనని చెప్పుకొచ్చింది. గతంలోనూ గ్లామర్ రోల్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫేమ్ కోసం గ్లామర్ షో చేయనని తెలిపింది.




