- Telugu News Photo Gallery Cinema photos Heroines who have an image and don't have a pan India chance
Heroines: ఇమేజ్ ఉండి.. పాన్ ఇండియా ఛాన్సుల్లేని ఆ బ్యూటీస్ ఎవరు.?
చిన్నా పెద్ద తేడా లేకుండా ఇప్పుడందరి ఫోకస్ పాన్ ఇండియాపైనే ఉంది. కొడితే కుంభ స్థలమే అన్నట్లు అంతా దానిపైనే దృష్టి పెడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పాన్ ఇండియన్ మార్కెట్‌కు దూరంగా ఉన్నారు. దానికి కారణం వాళ్లకు ఛాన్సులు రాకపోవడమే. మరి ఇమేజ్ ఉండి.. పాన్ ఇండియా ఛాన్సుల్లేని ఆ బ్యూటీస్ ఎవరు..?
Updated on: Oct 07, 2024 | 3:04 PM

ఎందుకో తెలియదు కానీ శ్రీలీలకు పాన్ ఇండియన్ ఆఫర్స్ రావట్లేదు. కేవలం రీజినల్ సినిమాలకే పరిమితం అవుతున్నారు ఈ బ్యూటీ. తెలుగులో సెన్సేషనల్ సినిమాలు చేసి.. ఖతర్నాక్ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీలీల గుంటూరు కారం తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చారు.

ప్రస్తుతం నటిస్తున్న నితిన్ రాబిన్ హుడ్, పవన్ ఉస్తాద్, రవితేజ 75.. ఇవన్నీ తెలుగు సినిమాలు మాత్రమే.రష్మిక మందన్న, సమంతలా పాన్ ఇండియన్ ఛాన్సుల కోసం వేచి చూస్తున్నారు శ్రీలీల.

అలాగే పూజా హెగ్డే సైతం తన కెరీర్ మార్చేసే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసమే వెయిటింగ్. ఈ మధ్యే విజయ్ 69లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు పూజా. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలోనూ ఈమే హీరోయిన్. ఇమేజ్ ఉంది కానీ.. పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకోలేదు పూజా.

సీతా రామం, హాయ్ నాన్న లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాళ్ ఠాకూర్‌కు సైతం పాన్ ఇండియన్ అవకాశాలు రావట్లేదు. చేస్తే హిందీ.. లేదంటే తెలుగు అన్నట్లుంది ఈమె పరిస్థితి.

కృతి శెట్టికి పాన్ ఇండియా ఆఫర్స్ తర్వాత.. ముందు అవకాశాలే రావట్లేదు. ఏదేమైనా మంచి గుర్తింపు ఉన్నా.. దేశవ్యాప్తంగా దశ మార్చే సినిమాల కోసం వేచి చూస్తున్నారు ఈ బ్యూటీస్ అంతా.




