- Telugu News Photo Gallery Cinema photos 3000 crore business is going to be held from May to December in Tollywood after the summer
Telugu Movies: అంతా సమ్మర్ తర్వాతే.. ఈ ఏడాది మళ్లీ టాలీవుడ్ ఇండియాకి బాద్‍షా కానుందా.?
అదేంటో మరి.. రెండేళ్లుగా మన హీరోలు కొత్త అలవాటు నేర్చుకుంటున్నారు. సమ్మర్‌లో రండయ్యా బాబూ అంటే.. వద్దులే సెకండాఫ్‌లో చూసుకుందాం అంటున్నారు. సమ్మర్ తర్వాతే సినిమా జాతర షురూ కానుంది. మే నుంచి డిసెంబర్ మధ్యలో ఏకంగా 3000 కోట్ల బిజినెస్ జరగబోతుంది. మరి ఏంటా సినిమాలు.. వాటి రేంజ్ ఎంత..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం.. సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ అనేది ఒకటి ఉందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు మన హీరోలు. అందుకే నేరుగా సెకండాఫ్ వైపు అడుగులేస్తున్నారు.
Updated on: Mar 04, 2024 | 9:10 AM

మే 9న కల్కి ప్రభాస్ 2898 AD మినహాయిస్తే.. ఆగస్ట్ వరకు మళ్లీ స్టార్ హీరోలెవరూ రావట్లేదు. కల్కి రేంజ్ 1000 కోట్లకు పైగానే ఉంది. నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి దర్శకుడు. వైజయంతి మూవీస్ లో భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల కానుంది.

ఇక ఆగస్ట్ 15న పుష్ప 2తో అసలు సినిమా జాతర మొదలు కానుంది. 1000 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు అల్లు అర్జున్. ఈ చిత్రంపై భారీ అంచనాల ఉన్నాయి కాబట్టి ఇది పక్కాగా టార్గెట్ రిచ్ అవుతుందన్న ఆశతో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్.

అల్లు అర్జున్ తర్వాత రెండు వారాలు గ్యాప్ తీసుకుని నాని సరిపోదా శనివారంతో వస్తున్నారు ఆగస్ట్ 29న విడుదల కానున్న ఈ చిత్ర బిజినెస్ కూడా 60 కోట్ల వరకు జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్. వివేక్ ఆత్రేయ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబర్ 10న దేవర పార్ట్ 1న విడుదల కానుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బిజినెస్ అన్ని భాషల్లో కలిపి 300 కోట్ల వరకు జరుగుతుంది. ఈ సినిమా వచ్చిన మరుసటి రోజే తండేల్‌తో నాగ చైతన్య అక్టోబర్ 11న రానున్నారు. ఇక బాలయ్య NBK 109 సైతం దసరాకే రావాలని చూస్తున్నారు

దసరా తర్వాత మళ్లీ డిసెంబర్‌లోనే భారీ సినిమాలు రానున్నాయి. ఎప్పట్నుంచో సస్పెన్స్‌లో ఉన్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ 25న రానుందని తెలుస్తుంది. ఈ చిత్ర బిజినెస్ 300 కోట్లకు పైనే జరుగుతుంది. మొత్తానికి మే 9న కల్కితో మొదలై.. డిసెంబర్ 25న గేమ్ ఛేంజర్‌తో సెకండాఫ్ ఎండ్ కానుంది. ఈ సినిమాలన్నీ కరెక్టుగా వర్కవుట్ అయితే.. 2024 టాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్‌గా మారడం ఖాయం.




