Health Tips: చియా సీడ్స్ Vs సబ్జా సీడ్స్.. రెండింటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ఈ ఆధునిక యుగంలో అందరినీ వేధిస్తున్న సమస్య బరువు పెరగడం. మనం తినే ఆహారాలే బరువు పెరగడానికి ప్రధాన కారణం. ఈ క్రమంలో బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల పద్ధతులు పాటిస్తుంటాయి. చియా సీడ్స్, సబ్జా వాటర్ తాగుతుంటారు. అయితే ఈ రెండూ ఒకేలా కనిపించినప్పటికీ, వాటి పోషక విలువల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Sep 18, 2025 | 5:43 PM

చియా - సబ్జా గింజలు నీటిలో నానబెట్టినప్పుడు జెల్లీ లాగా మారుతాయి. ఈ రెండు గింజలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సీడ్స్ బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. ఎందుకంటే అవి కడుపు నిండిన ఫీల్‌ను కలిగిస్తాయి.

ఫైబర్: చియా సీడ్స్‌లో సబ్జా కంటే కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు నిండిన ఫీలింగ్‌న ఎక్కువసేపు ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా అవసరం.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: చియా సీడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు మంచి మూలం. ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్. ఈ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. సబ్జా గింజలలో కూడా ఒమేగా-3లు ఉంటాయి. కానీ చియా గింజలతో పోలిస్తే తక్కువ

ప్రోటీన్: చియా గింజల్లో సబ్జా సీడ్స్ కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఆకలిని తగ్గించి, కండర శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సబ్జా సీడ్స్‌లో చియా విత్తనాల కంటే కొద్దిగా తక్కువ క్యాలరీలు ఉంటాయి. మీరు క్యాలరీల గురించి ఆలోచిస్తుంటే ఇది ముఖ్యమైనది కావచ్చు.

విటమిన్లు - మినరల్స్: సబ్జా సీడ్స్ విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి వంటి విటమిన్లతో నిండి ఉంటే.. చియా సీడ్స్ కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.

ఈ రెండు సీడ్స్ వాటి వాటి ప్రత్యేకతలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మీ అవసరాలను బట్టి, ఈ రెండింటిలో దేనినైనా లేదా రెండింటినీ మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కేవలం ఇవే కాకుండా బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.




