- Telugu News Photo Gallery Business photos SC Railways' UTS App QR Code Initiative for Festive Season Travel
UTC: పండగల సీజన్.. రైల్వే ప్రయాణికులు అదిరిపోయే గుడ్‌న్యూస్! ఇక స్టేషన్‌లో..
దక్షిణ మధ్య రైల్వే పండగ సీజన్లో రద్దీని తగ్గించేందుకు UTS మొబైల్ యాప్ ద్వారా అనరిజర్వ్డ్ టిక్కెట్ల కొనుగోలును ప్రోత్సహిస్తోంది. స్టేషన్లలో QR కోడ్‌లతో జాకెట్లు ధరించిన సిబ్బంది యాప్ ఉపయోగంపై మార్గనిర్దేశం చేస్తారు. యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయడం ద్వారా క్యూలను తగ్గించవచ్చు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించవచ్చు.
Updated on: Sep 18, 2025 | 7:06 PM

రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సౌత్ సెంట్రల్ రైల్వేస్ విన్నూత ఆలోచన చేసింది. ప్రయాణికులు టిక్కెట్ల కోసం క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లను కొనుగోలు చేయాలని సూచించింది. యూటీఎస్ యాప్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఇప్పుడు దీని వినియోగం పెంచేందుకు రైల్వే స్టేషన్ ఆవరణలో కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకమైన జాకెట్ల ఇవ్వనుంది. ఈ జాకెట్ల వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని యూటిఎస్ యాప్ తో స్కాన్ చేసి చాలా సులభంగా జనరల్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

ప్రయాణీకుల కోసం రిజర్వ్ చేయని టిక్కెట్లను సౌకర్యవంతంగా కొనుగోలు చేయడానికి యూటిఎస్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ యాప్‌కు ఆరంభం నుంచే విశేషమైన స్పందన లభించింది. ఈ యాప్‌ను ఉపయోగించే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో యూటిఎస్ యాప్ ఒక పెద్ద ముందడుగుగా చెప్పొకోవచ్చు. అన్‌రిజర్వ్డ్ ప్రయాణికులకు ఈ యాప్ ఒక వరంగా మారింది. యూటిఎస్ మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల అమ్మకాన్ని ప్రోత్సహించడానికి, మొబైల్ యాప్ గురించి రైలు వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి రైల్వే అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే రాబోయే పండుగ సీజన్‌లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, స్టేషన్ ప్రాంతాలలో యూటిఎస్ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ల కొనుగోలును ప్రోత్సహించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక నూతన చొరవను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రెట్రో రిఫ్లెక్టివ్ జాకెట్లు వెనుక వైపున క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. యూ.టి.ఎస్ యాప్ లేదా రైల్ వన్ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి జనరల్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

స్టేషన్ కాన్కోర్స్ ప్రాంతంలో యూటిఎస్ మొబైల్ యాప్‌ను ప్రోత్సహించడానికి నియమించబడిన వ్యక్తులు ఈ జాకెట్లను ధరిస్తారు. ప్రయాణికులు జాకెట్ వెనుక భాగంలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. యూటిఎస్ యాప్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సిబ్బంది వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ చర్య టికెట్ కౌంటర్ల వద్ద క్యూలను తగ్గించడానికి, నగదు రహిత, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

ఈ సౌకర్యం జోన్‌లోని ఆరు డివిజన్‌లలోని ప్రధాన స్టేషన్లు అయిన సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నాందేడ్ మొదలైన వాటిలో ప్రవేశపెట్టనున్నారు. జనరల్ టిక్కెట్ల కొనుగోలు కోసం మొదట విధించిన దూర పరిమితులను సడలించారు, ప్రయాణికులు ఇప్పుడు స్టేషన్ ప్రాంగణం, రైల్వే ట్రాక్ నుండి 5 మీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రదేశం నుండైనా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.




