మంచం మీద నుంచి లేవాలనిపించడం లేదా? కారణాలు తెలిస్తే ఫ్యూజులౌట్ అంతే..

సోమరితనం, బద్దకం గురించి పదే పదే వింటుంటాం.. అయితే.. దీనికి వెనుక చాలా కారణాలు ప్రభావితం చూపుతాయి.. కొన్ని సార్లు మంచం మీద నుంచి లేవాలని అనిపించదు.. ఇలాంటప్పుడు మన శరీరం పని చేయడానికి సిద్ధంగా లేదని తరచుగా భావిస్తాము. ఇలాంటి సమయాల్లో మంచం మీదనే ఉంటాం.. ఆకలి, నీళ్లు తాగడం, స్నానం లాంటివి చేయాలని అనిపించదు..

|

Updated on: Jun 16, 2024 | 12:55 PM

సోమరితనం, బద్దకం గురించి పదే పదే వింటుంటాం.. అయితే.. దీనికి వెనుక చాలా కారణాలు ప్రభావితం చూపుతాయి.. కొన్ని సార్లు మంచం మీద నుంచి లేవాలని అనిపించదు.. ఇలాంటప్పుడు మన శరీరం పని చేయడానికి సిద్ధంగా లేదని తరచుగా భావిస్తాము. ఇలాంటి సమయాల్లో మంచం మీదనే ఉంటాం.. ఆకలి, నీళ్లు తాగడం, స్నానం లాంటివి చేయాలని అనిపించదు.. రోజంతా విశ్రాంతి తీసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తారు.. ఇదేవిధంగా అప్పుడప్పుడు జరిగినా ఫర్వాలేదు.. కానీ మీరు నిరంతరం బద్ధకం.. సోమరితనం అనుభవిస్తూ ఉంటే, దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.. మీ శరీరాన్ని అన్ని వేళలా అలసిపోయేలా, సోమరితనంగా మార్చే ఆ 5 కారణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
అనారోగ్యకరమైన ఆహారం: మనం తినేవి మన శక్తి స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం అలసట, బద్ధకాన్ని కలిగిస్తుంది. మరోవైపు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సమతుల్య ఆహారం రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2 / 6
డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) : శరీరంలో నీటి కొరత కూడా అలసట, నీరసానికి ప్రధాన కారణం. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు, రక్తం మందంగా మారుతుంది.. దీంతో కణాలకు పోషకాలను అందించడం కష్టమవుతుంది. ఇది కండరాల తిమ్మిరి, అలసటను కలిగిస్తుంది. అందువల్ల, రోజంతా తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం.

3 / 6
నిద్ర లేకపోవడం: సరైన నిద్ర లేకపోవటం వల్ల కూడా నీరసం వస్తుంది. రాత్రిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. నిద్రలో, శరీరం తనను తాను రిపేర్ చేస్తుంది.. అంతేకాకుండా శక్తి నిల్వలను తిరిగి నింపుతుంది.

4 / 6
వ్యాయామం లేకపోవడం: శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా రెగ్యులర్ వ్యాయామం ముఖ్యం. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలను బలపరుస్తుంది.. ఎండార్ఫిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది.. ఇది మనకు సంతోషంగా ఉండేలా చేయడంతోపాటు శక్తినిస్తుంది.

5 / 6
వైద్యపరమైన కారణాలు: స్థిరమైన అలసట, బద్ధకం వెనుక కొన్నిసార్లు వైద్యపరమైన కారణం ఉండవచ్చు. థైరాయిడ్ సమస్య, రక్తహీనత, డిప్రెషన్ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వంటివి.. మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

6 / 6
Follow us
Latest Articles